twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అకిరా, ఆద్య వైరల్ పిక్.. మీ కోసం చంపుతా, చస్తా అంటూ ఎమోషనల్‌గా రేణుదేశాయ్!

    |

    Recommended Video

    Renu Desai Emotional Comments On Her Children

    పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పిల్లలు అకిరా, ఆద్యతో పుణేలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి విడిపోయాక తన పిల్లల ఆలనా పాలనా రేణుదేశాయ్ చూసుకుంటోంది. పవన్ నుంచి విడిపోయినప్పటికీ పిల్లలకోసం వీరిద్దరూ తరచుగా కలుస్తూనే ఉంటారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అకిరా, ఆద్య గురించి సోషల్ మీడియాలో ఫాన్స్ కు తెలియజేస్తుంటుంది. రేణు దేశాయ్ తాజగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ వైరల్ గా మారింది. అకిరా, ఆద్య చాలా క్యూట్ గా ఉన్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది.

    చెల్లెలితో సరదాగా అకిరా

    చెల్లెలితో సరదాగా అకిరా

    ఆద్యతో అకిరా సరదాగా ఉండగా రెండు దేశాయ్ ఈ ఫోటో క్లిక్ మనిపించింది. ఆద్య చిరునవ్వులు చిందిస్తుండగా, అకిరా అలా చెల్లెలిపై తల వాల్చి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ ఫాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది.

    మీ కోసం చంపుతా, చస్తా

    ఈ పిక్ తో పాటు రేణుదేశాయ్ ఓ కవితని కూడా పోస్ట్ చేసింది. చాలా ఎమోషనల్ మీనింగ్ వచ్చేలా ఈ కవిత ఉంది. నేను మీ కోసం చంపుతా, చస్తా అనే పదాలు ఉన్నాయి.

    ఒక తల్లిగా

    ఒక తల్లిగా

    ఒక తల్లిగా ఈ మాటలు చెబుతున్నానంటూ రేణు దేశాయ్ ఈ పోస్ట్ పెట్టింది. ఇలాంటి క్యూట్ పిక్స్ చాలా ఉన్నాయంటూ రేణుదేశాయ్ చెబుతోంది.

    ఆరడుగులు దాటిపోయేలా

    ఆరడుగులు దాటిపోయేలా

    అకిరాకు సంబందించిన ఫోటోలు ఎక్కడ కనిపించినా అవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అకిరా అప్పుడే ఆరడుగుల ఎత్తు దాటిపోయేలా కనిపిస్తున్నాడు. ఫాన్స్ అప్పుడే అకిరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలిచేస్తున్నారు.

    English summary
    Renu Desai shares cute pic of Akira and Adhya. Renu Desai emotional comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X