ఒక్క మాట చెబితే పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లేవారు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. బద్రి సినిమాతో హీరోయిన్ గా అలరించిన ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకుని అమ్మగా అనురాగం అందిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నారు. నటి రేణు దేశాయ్ పై నిత్యం పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా షేర్ చేసిన ఓ వీడియో హాట్ టాపిక్ గా మారింది.
వివాహబంధంలోకి: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రేణు దేశాయ్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కెమిస్ట్రీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లోకి వెళ్లారు. అప్పుడు అకీరా నందన్ కు జన్మనిచ్చారు రేణు దేశాయ్. అనంతరం వివాహ బంధంలోకి అడుగు పెట్టాక ఆద్య అనే పాపకు తల్లిదండ్రులు అయ్యారు పవన్-రేణు దేశాయ్.

11 ఏళ్లు నిందితురాలిగా : పలు కారణాల వల్ల 2012లో పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దర పిల్లల బాధ్యతలు తీసుకుంటూ నటిగా, దర్శకురాలిగా సినీ కెరీర్ సాగిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఈ మధ్య ఎక్కువగా ఆమె పవన్ కల్యాణ్ అభిమానులతో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుంటున్నారు. 11 ఏళ్లుగా నిందితురాలిగా చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మగాడిని పట్టించుకోరు : అయితే తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఓ వీడియో సంచలనంగా మారింది. అందులో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. అందులో రేణు దేశాయ్ జీవితం గురించి ఆమె చెప్పుకొచ్చారు. సమాజం మహిళపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుందని, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే అందరి దృష్టి ఆ మహిళపైనే ఉంటుంది తప్పా మగాడిని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు.

సహజీవనం వల్ల కాదని : "పవన్ కల్యాణ్ విషయంలో రేణు దేశాయ్ ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో త్యాగాలు చేసింది. పవన్ తో ఆమె సహజీవనం చేసి ఓ బిడ్డను కనేందుకు కూడా ముందుకు వచ్చింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు. రేణు దేశాయ్ పవన్ కు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించింది. ఆరోజు గనక నాకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు. పవన్ కల్యాణ్ నన్ను ఏదో ఒక చిన్న గుడిలో పెళ్లి చేసుకున్నారు అనే మాట చెప్పుంటే పవన్ కల్యాణ్ కు జైలు శిక్ష పడేది" అని కృష్ణ కుమారి వెల్లడించారు.

చాలా ఏడ్చాను : సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేశారు. "నాకు ఈవిడ ఎవరో తెలియదు. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ తొలిసారి పబ్లిక్ లో నా తరఫున మాట్లాడటం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా మాట్లాడితే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాను అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా బాధ అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం వచ్చింది" అని రేణు దేశాయ్ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











