స్టైలిష్ లుక్‌లో అకీరా.. నా పిల్లలు ఏంజెల్స్ అంటున్న రేణుదేశాయ్!
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణుదేశాయ్ తన పిల్లలతో పుణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు పలు విషయాలని అభిమానులకు తెలియజేస్తుంటారు. అకీరా, ఆద్యకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవి వైరల్ గా మారడం జరుగుతూనే ఉంది. పవన్ తనయుడు అకీరా చిన్న వయసులోనే ఆరడుగుల ఆజానుబాహుడిగా మారిపోయాడు. ఇటీవల్ రేణు అకీరా స్టైలిష్ ఫోటోని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

నా పిల్లలు ఎంజెల్స్
ఫొటోల్లో నా పిల్లలు అందంగా కుదిరిపోతారు. అలాంటి పిల్లలని ఫోటోలు తీయడం, ఎడిట్ చేయడం లాంటి అంశాలు నాకు చాలా బాగా అనిపిస్తాయి. అకీరా, ఆధ్య నేను కోరిన విధంగా ఓపికగా ఫోటోలకు ఫోజులు ఇస్తారు. నా పిల్లలు ఏంజెల్స్ అంటూ రేణు దేశాయ్ మురిసిపోతోంది. అకిరా నందన్ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోని రేణు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అలా పిలవడం ఇష్టం లేదు
ఇప్పటికే అకీరాని అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ప్రారంభించేశారు. తాజాగా రేణు పోస్ట్ చేసిన పిక్ పై అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అకిరా చిన్నతనంలో పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తనకు, పవన్ కళ్యాణ్ కు అకీరా నందన్ ని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ఇష్టం లేదని రేణు దేశాయ్ పలు సందర్భంల్లో వెల్లడించింది.

కొత్త జీవితంలోకి
రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయిన చాలా రోజుల తరువాత రెండో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల రేణు దేశాయ్ నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ఎవరనే విషయాన్ని రేణు గోప్యంగా ఉంచారు. త్వరలో వివాహం కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత పవన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా మాజీ భార్యకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో ట్రోలింగ్
రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగే సమయంలో పవన్ అభిమానుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ట్రోలింగ్ ఎదురవుతుండడంతో ఆమె కొంతకాలం సామజిక మాధ్యమాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. 2012లో పవన్, రేణు దేశాయ్ విడిపోయారు.


Click it and Unblock the Notifications











