హైదరాబాద్ షిప్ట్ అవుతున్న రేణు దేశాయ్... కారణం అదే, రెండో పెళ్లి సంగతేమైంది?
నటి, దర్శకురాలు, నిర్మాత, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ హైదరాబాద్ షిప్ట్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ హేమ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు... ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.
2017లో స్టార్ మా టీవీలో 'నీతోనే డాన్స్' కార్యక్రమం చేసినప్పటి నుంచి తెలుగులో చాలా ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, దీంతో పాటు రైతుల గురించి టాలీవుడ్లో ఓ సినిమా చేసే ఆలోచన కూడా ఉంది. అందుకే హైదరాబాద్ షిప్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

రైతుల సమస్యపై సినిమా
రైతుల సమస్యల గురించి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ముందు ఈ చిత్రాన్ని మరాఠీలో చేద్దామనుకున్నాను. కానీ చాలా మంది టాలీవుడ్ ఆడియన్స్ నన్ను తెలుగులో సినిమా చేయాలని అడుగుతున్నారు. రైతుల సమస్య అనేది ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు కాబట్టి తెలుగులో చేద్దామని డిసైడ్ అయినట్లు తెలిపారు.

అటూ ఇటూ తిరగడం కష్టంగా ఉంది
రైతుల గురించి చేసే సినిమాకు నేనే నిర్మిస్తూ డైరెక్షన్ చేయబోతున్నాను. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మీటింగ్స్, ఇతర అంశాలపై తరచూ పూణె నుంచి హైదరాబాద్ రావాల్సి వస్తోంది. ఈ అప్ అండ్ డౌన్ జర్నీ కష్టంగా ఉంది... అని రేణు దేశాయ్ తెలిపారు.

అందుకే హైదరాబాద్ షిప్ట్ అవుతున్నాను
ఈ సినిమా అయ్యే వరకు హైదరాబాద్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే పిల్లలతో కలిసి ఒక సంవత్సరం ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ కెరీర్ బావుంటే, మంచి సినిమాలు చేసే అవకాశం వస్తే హైదరాబాద్‌లోనే కంటిన్యూ అవుతాను... అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.

రెండో పెళ్లి సంగతేమైంది?
తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు రేణు దేశాయ్ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పూణెకు చెందిన వ్యక్తితో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అతడు ఎవరు? అనే విషయాన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు. త్వరలోనే అతడితో కొత్త జీవితం మొదలు పెడతానని చెప్పిన రేణు... ఇపుడు హైదరాబాద్ షిప్ట్ అవుతుండటం, పరిస్థితులు అనుకూలిస్తే ఇక్కడే ఉండాలనే ఆలోచనకు రావడం చర్చనీయాంశం అయింది.

హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు?
హైదరాబాద్ షిప్ట్ అయ్యే ఆలోచన ఉంది కానీ.. ఎప్పుడు? ఏమిటి? అనేది విషయంలో రేణు దేశాయ్ క్లారిటీ ఇవ్వలేదు. తాను ప్లాన్ చేస్తున్న రైతుల సినిమా ప్రకటించిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనిపై బిజీగా ఉన్నారట.


Click it and Unblock the Notifications











