అకీరా పారిపోవాలనే ప్రయత్నం.. భయంగా ఉంది: కొడుకుపై రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

By Manoj

సినిమాలు చేసింది తక్కువే అయినప్పటికీ ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నారు సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్. మొదటి సినిమాతోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడడంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే రేణుపై ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక, పవన్‌ను వివాహం ఆడిన తర్వాత ఆమె అస్సలు కనిపించలేదు. కానీ, ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన కొడుకు ఇంటి నుంచి పారిపోవాలనుకుంటున్నాడని తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం.!

పవన్‌తో రేణు ప్రేమాయణం మొదలైంది అక్కడే

పవన్‌తో రేణు ప్రేమాయణం మొదలైంది అక్కడే


రేణు దేశాయ్.. పుణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారామె. ఆ తర్వాత తమిళంలో ‘జేమ్స్ పాండూ' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘బద్రీ'లో పవన్‌తో కలిసి నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పట్టింది.

9 ఏళ్ల పాటు సహజీవనం.. దేశ వ్యాప్తంగా చర్చ

9 ఏళ్ల పాటు సహజీవనం.. దేశ వ్యాప్తంగా చర్చ

పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ దాదాపు తొమ్మిదేళ్ల పాటు సహజీవనం చేశారు. అంతేకాదు, ఆ సమయంలోనే ఓ బిడ్డ (అకీరా)కు జన్మనిచ్చారు. దీంతో వీళ్లిద్దరూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. ఆ సమయంలోనే అంటే 2009లో ఈ జంట అగ్నిసాక్షిగా ఒక్కటైంది. ఆ తర్వాత వీళ్లకు ఓ పాప కూడా జన్మించింది. 2011లో వీళ్లు విడాకులు తీసుకున్నారు.

మరో వ్యక్తితో రేణు పెళ్లి... ఫొటోలకే పరిమితం

మరో వ్యక్తితో రేణు పెళ్లి... ఫొటోలకే పరిమితం


పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత పుణేలో స్థిరపడ్డారు రేణు దేశాయ్. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న ఆమె.. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు, అతడితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు ఫొటోలు వదిలారు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె పెళ్లి గురించి మాట్లాడలేదు. దీంతో అది ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది.

రెండు సార్లు పవన్‌తోనే.. అక్కడ అలా ఎంట్రీ

రెండు సార్లు పవన్‌తోనే.. అక్కడ అలా ఎంట్రీ

రేణు దేశాయ్ తెలుగులో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా చేసింది. ఆ రెండు చిత్రాలు పవన్ నటించిన ‘బద్రీ', ‘జానీ'. వీటి కంటే ముందు తమిళంలో ‘జేమ్స్ పాండూ'లో నటించింది. ఇక, పవన్‌తో విడాకుల తర్వాత ఆమె ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి మూవీతో నిర్మాత కమ్ దర్శకురాలిగా మారింది. అంతేకాదు, కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేసింది.

టాలీవుడ్‌లోకి రీఎంట్రీ... పవన్ సినిమాలో ఛాన్స్

టాలీవుడ్‌లోకి రీఎంట్రీ... పవన్ సినిమాలో ఛాన్స్

ప్రస్తుతం స్వాతంత్ర్య జీవనం గడపుతున్న రేణు దేశాయ్.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. ఇక, ఇటవల రేణు.. పవన్ కమ్‌బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్'లో చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల వాటిని ఖండించారు ఈ సీనియర్ హీరోయిన్.

అకీరా ఇంటి నుంచి పారిపోవాలనుకుంటున్నాడు

రేణు దేశాయ్ తాజాగా తన కొడుకును ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తన కుమారుడు అకీరాతో పాటు పెట్ డాగ్ ఫీబో కిటీకీ దగ్గర నుంచి బయటకు చూస్తున్న ఫొటోలను షేర్ చేసిన ఆమె... ‘ఫీబో, అకీరా ఇంటి నుంచి పారిపోవాలని చూస్తున్నారు' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Recommended Video

Pawan Kalyan Costly Gift To His Kids | Filmibeat Telugu
16 ఏళ్లకే ట్రెండ్ సెట్ చేశాడు.. అది ఇష్టం ఉండదట

16 ఏళ్లకే ట్రెండ్ సెట్ చేశాడు.. అది ఇష్టం ఉండదట

అకీరా నందన్ ఇటీవల పుట్టినరోజు జరుపుకున్నాడు. పవన్ కల్యాణ్ కుమారుడు కావడంతో అతడి పుట్టినరోజును మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీంతో 16 ఏళ్లకే దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే, అకీరాకు సోషల్ మీడియా అంటే ఇష్టం ఉండదని, అందుకే అతడి ఫొటోలు కూడా షేర్ చేయనని రేణు ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X