Don't Miss!
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
రెండో పెళ్లిపై తెలివిగా స్పందించిన రేణూ దేశాయ్.. బయోపిక్ తీయాలేమో..?
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ చాలా రోజుల తరువాత రెండో పెళ్లిపై స్పందించారు. గత ఏడాది నుంచి ఆమె పెళ్లిపై రూమర్స్ ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో రూమర్స్ డోస్ కాస్త ఎక్కువవ్వడంతో రేణూ దేశాయ్ ఉహీంచని విధంగా స్పందించింది. క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి ఆమె ఫైనల్ గా మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్ని ప్రశ్నలు వచ్చినా..
ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఆ మధ్య లైవ్ లో చాట్ చేసిన రేణూ దేశాయ్ పెళ్లిపై చాలా ప్రశ్నలు ఎదుర్కొంది. కానీ ఆమె ఆ విషయం గురించి పెద్దగా స్పందించలేదు. ఇక ఇటీవల ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆమె తన లైఫ్ గురించి అనేక విషయాలు చెప్పింది. ఈ లాక్ డౌన్ లో బయటకు వెళ్లడం లేదని ఇంట్లోనే పిల్లలతో ఉంటున్నట్లు చెప్పింది.
ఆ విషయం గురించి మీకెందుకు..?
చాలా కాలంగా తన పెళ్లిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నట్లు చెప్పిన రేణూ దేశాయ్ పెళ్లి చేసుకున్నా కష్టమే.. చేసుకోకపోయినా కష్టమే అని కామెంట్ చేశారు. అయితే ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తే.. ఈ విషయంపై ఒక ఆన్సర్ ఇస్తానని కూడా యాంకర్ కి సమాధానం ఇచ్చింది. ఇక నా పెళ్లికి వచ్చేది లేదు.. చేసేదేమీ లేదు ఎందుకు ఇలాంటి విషయాలపై ఆసక్తి అని కూడా ఆమె వివరణ ఇచ్చారు.
సినిమా టైటిల్ పెళ్లి గోల..
ఇక పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయిన తాను ఒక సినిమా చేస్తానని దానికి పెళ్లి గోల అనే టైటిల్ పెడతానని సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఇలాంటి సందేహాలు అనవసరం అంటూ.. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె తెలియజేశారు. మొత్తానికి పెళ్లిపై మాట్లాడిన రేణు దేశాయ్ ఎందుకో ఆ విషయంపై సరైన క్లారీటి ఇవ్వకపోవడం వైరల్ అవుతోంది.
Recommended Video
మహేష్, ప్రభాస్ సినిమాల్లో..
ఇక యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. మంచి మదర్ రోల్స్ లో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు. ప్రభాస్, మహేష్ వంటి హీరోలకు తల్లి పాత్రల్లో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అని యాంకర్ అడగ్గా.. వారి చిన్నప్పటి మదర్ గా కనిపిస్తాను అని తెలివిగా సమాధానం ఇచ్చారు. పాత్ర బావుంటే ఎలాంటి సినిమాలో అయినా నటించడానికి సిద్దమే అని రేణూ దేశాయ్ తెలిపారు.