twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అకిరా నందన్ ప్రశ్నకు రేణూ దేశాయ్ ఆశ్చర్యం.. ఎంతైనా తండ్రికి తగ్గ తనయుడు!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూనూగు మీసాలతో టీనేజ్‌‌లో ఉన్న అకీరాను చూసి అభిమానులు మురిసిపోతోంటారు. అచ్చం తండ్రిలానే ఉంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. నాన్నలానే పబ్లిసిటీకి దూరంగా ఉంటూ.. తన ప్రపంచం ఏదో తానే అన్నట్టుగా ఉంటాడు. అయితే మధ్య మధ్యలో అకీరా నందన్ గురించి రేణూ దేశాయ్ చెప్పే విషయాలు మాత్రం అభిమానులను ఆకట్టుకుంటాయి.

    నేడు అకీరా నందన్ బర్త్ డే..

    నేడు అకీరా నందన్ బర్త్ డే..

    అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ట్వీట్లలో అకీరా నందర్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తుంటారు. ఈ రోజు ట్విట్టర్‌లో అకీరా నందన్ పేరు మోత మోగిపోతోంది. తాజాగా రేణూ దేశాయ్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

    దైవ దర్శనం..

    దైవ దర్శనం..

    అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ అంతా దైవ దర్శనానికి వెళ్లినట్టుంది. పుట్టిన రోజు కదా? అని అకీరా నందన్ సంప్రదాయబద్దంగా రెడీ అయ్యాడు. ధోతి కట్టుకుని అలా పోజులిచ్చాడు. ఆ ఫోటోలను రేణూ దేశాయ్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

    ఆ ప్రశ్నతో ఆశ్చర్యం..

    ఆ ప్రశ్నతో ఆశ్చర్యం..

    దర్శనం పూర్తి చేసుకుని హోటల్ నుంచి బయటకు వచ్చాక అకీరా అడిగిన ప్రశ్నతో ఆశ్చర్యపోయాను. మహిళలు చీరలు కట్టుకోవడం ఎంతో సాధారణం.. అయితే మగవారు ధోతిలు, లుంగీలు కట్టుకుంటే మాత్రం ఎందుకు వేరేలా చూస్తారు..? పండుగలు, గుళ్లకు వెళ్లినప్పుడే అవి కట్టుకోవాలా? అని అడిగాడు.

    అది మన సంప్రదాయం..

    అది మన సంప్రదాయం..

    అప్పుడు నేను అకీరాకు ఇలా చెప్పాను. అది కేవలం మన మైండ్ సెట్. మనకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలాంటివి ధరించవచ్చు. ధోతి కట్టుకోవడమే మన సంప్రదాయం. అని అకీరాకు చెప్పాను. మీరు కూడా అలానే చేయండి.. మన కల్చర్ ప్రకారం మగవారు ధోతి లుంగీలు కట్టుకోవడం సాధారణ విషయమే అని తెలియజేయండి.

    గర్వంగా అనిపిస్తోంది..

    గర్వంగా అనిపిస్తోంది..

    అవి ధరించడాన్ని వింతగా చూడకండి.. ప్రతీ రోజూ అవి కట్టుకోవచ్చు. జీన్స్, షార్ట్స్ ధరించకుండా ప్రతీ రోజూ అకీరా ధోతి, లుంగీలను కట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నాడు. అయినా కూడా వెస్ట్రన్ కల్చర్‌ను గుడ్డిగా నమ్మి మన సంప్రదాయాలను పక్కన పెట్టకుండా.. మన సంప్రదాయ దుస్తులను ధరించడం గర్వంగా ఫీల్ అవ్వండి.. నువ్ నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తున్నావ్ అకిరా అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.

    ఇలా అకీరా ఆలోచించడంపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా తండ్రికి తగ్గ తనయుడు అంటున్నారు.

    English summary
    Renu desai Shocks Over Akira nandan Question
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X