పవన్ కల్యాణ్‌కు, ఫ్యాన్స్‌కూ ఇక దూరం.. రేణుదేశాయ్ అనూహ్య నిర్ణయం..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ ఏమి మాట్లాడినా అది వివాదంగా మారుతున్నది.

By Rajababu

Recommended Video

Renu Desai Opens Up On Her Second Marrige రేణు దేశాయ్ రెండోపెళ్లి..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ ఏమి మాట్లాడినా అది వివాదంగా మారుతున్నది. తన వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా మీడియాతో షేర్ చేసుకొంటే పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ ప్రస్తుతం తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. రేణుదేశాయ్ కెరీర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

రెండో వివాహంపై

రెండో వివాహంపై

తనపై అభ్యంతరకంగా కామెంట్స్ చేసిన పవన్ ఫ్యాన్స్ కు గానీ, ఇతరులకు గానీ బుద్ధి చెప్పడానికైనా ఖచ్చితంగా మరో వివాహం చేసుకుని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం పొందే యోచనలో రేణుదేశాయ్ ఉన్నట్లుంది.

నన్ను అలా పిలువొద్దు

నన్ను అలా పిలువొద్దు

తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ అని పిలవడం కన్నా, అకీరా, ఆద్యాల తండ్రి పవన్ కళ్యాణ్ అని పిలవడం ఉత్తమమేమో ఇటీవల ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

 సెకండ్ ఇన్సింగ్స్‌కు రెడీ

సెకండ్ ఇన్సింగ్స్‌కు రెడీ

తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడ్డ రేణుదేశాయ్ ఇప్పుడిప్పుడే యాక్టింగ్‌పై దృష్టిపెడుతున్నది. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాలని ట్రయల్స్ వేస్తున్నది. అంతకుముందు బుల్లితెరపై చేసిన నీతోనే డ్యాన్స్ షో ప్రయోగం కొంత బెడిసి కొట్టింది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బిగ్ స్క్రీన్‌పై అవకాశాలను రేణుదేశాయ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

రేణుదేశాయ్ ఆచీతూచీ

రేణుదేశాయ్ ఆచీతూచీ

టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నప్పటికీ రేణుదేశాయ్ ఆచితూచీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏదైనా సినిమాను అంగీకరిస్తే.. అందులో ఉండే పాత్రపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో అనే విషయం ఆమెకు పెద్ద అడ్డంకిగా మారింది అనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అవకాశాలను పరిశీలిస్తునే.. మరో రంగంపై దృష్టిపెట్టినట్టు సమాచారం.

మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్

మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్

బద్రీ, జానీ చిత్రాల తర్వాత రేణుదేశాయ్ పెద్దగా నటించిందిలేదు. ఇప్పటివరకు ఓ మూడు నాలుగు సినిమాలు చేసి ఉంటుంది. యాక్టింగ్‌లో సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించడానికి మలయాళ చిత్ర పరిశ్రమను ఎంచుకొన్నట్టు తెలుస్తున్నది. కథ నచ్చడంతో వెండితెర మీద రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ చెప్పేసిందట!

 పాత్రల ఛాయిస్ ఏమిటో...

పాత్రల ఛాయిస్ ఏమిటో...

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేణుదేశాయ్ హీరోయిన్ పాత్రలకే మొగ్గు చూపుతుందా? లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడుతారా అనే విషయం కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది. ఒకవేళ మలయాళ చిత్రం విజయం సాధిస్తే అక్కడ బిజీగా మారిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలుగులో రమ్యకృష్ణ, నదియా, జయసుధ మాదిరిగా పాగా వేసే అవకాశాన్ని తీసిపోలేం.

హీరోయిన్‌? క్యారెక్టర్ ఆర్టిస్టుగానా?

హీరోయిన్‌? క్యారెక్టర్ ఆర్టిస్టుగానా?

మలయాళ చిత్రంలో రేణుదేశాయ్ ఎలాంటి పాత్రను పోషించున్నారనే విషయంపై చర్చ జరుగుతున్నది. హీరోయిన్‌గా ట్రై చేస్తున్నారా? లేక మహిళా నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారా? మరే పాత్రను పోషిస్తున్నారు అనే విషయంపై క్లారిటీ లేదు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X