»   » బర్త్ డే: పవన్ ఆలోచనలకు దూరంగా రేణు దేశాయ్!

బర్త్ డే: పవన్ ఆలోచనలకు దూరంగా రేణు దేశాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నాకు గురువు లాంటి వారు, ఆయన ద్వారానే సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలు నేర్చుకున్నాను, నేను ఫిల్మ్ మేకర్‌గా మారడం వెనక ఆయన ప్రభావం చాలా ఉంది. 1999 నుండి నేను పవన్ కళ్యాణ్ గారి నుండి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను. ఆయన నాకు దొరికిన బెస్ట్ టీచర్. ఈ విషయంలో నేను తనకు పెద్ద థాంక్స్ చెప్పాలి. నిమాను ఇష్టంగా, సిన్సియర్‌గా తీయడం నేర్పిన పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతున్నాను...... అంటూ గత సంవత్సరం సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు.

అయితే ఈ సారి మాత్రం రేణు దేశాయ్ ఉలుకు, పలుకు లేకుండా ఉంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ కనీసం విషెస్ కూడా చెప్పలేదు. ఆమె తన ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో కనీసం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా కాలం క్రితమే విడిపోయినా.... ఇద్దరి మధ్య స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీరు నచ్చక పోవడం, తాను ఏ కామెంట్ చేసినా వారు మరో మరో రకంగా అర్థం చేసుకోవడం లాంటి పరిణామాలతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడం మానేసిందని, పవన్ గురించి ఆలోచనలకు కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు.

బద్రి సినిమాతో మొదలు...

బద్రి సినిమాతో మొదలు...

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

పవన్ జీవితంలోకి...

పవన్ జీవితంలోకి...

‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

వైవాహిక జీవితం

వైవాహిక జీవితం

పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడక తప్పలేదు. సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగింది.

విడిపోయారు...

విడిపోయారు...

నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు. తర్వాత ఆయనతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా, ఆద్యా అనే ఇద్దరు పిల్లకు తల్లయింది. ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమలో తన నిర్మాతగా, దర్శకురాలిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.

English summary
Renu Desai silence on Pawan Birth day.
Please Wait while comments are loading...