రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నా, వాస్తవాలు బయట పెడితే!
Recommended Video

పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని విసిగిస్తున్నారంటూ చాలా రోజులుగా రేణుదేశాయ్ చెబుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమె రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ కు అభిమానుల తాకిడి ఎక్కువైంది. సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ పేరుతో ట్రోలింగ్ జరుగుతోంది. విసుగెత్తిపోయిన రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాని క్లోజ్ చేశారు. తాజగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తికి రేణు దేశాయ్ ఇచ్చిన రరిప్లై సంచలనం రేపే విధంగా ఉంది. ఈ రిప్లైతో రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

విసుగెత్తిపోయిన రేణు దేశాయ్
రేణు దేశాయ్ రెండవ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు వార్తలు మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. రేణు దేశాయ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. ట్రోలింగ్ తో విసుగెత్తిపోయిన రేణు ఇటీవల తన ట్విట్టర్ ఖాతాని మూసివేశారు.

స్వయంగా పవనే
స్వయంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా రేణు దేశాయ్ కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ పవన్ ఫాన్స్ మాత్రం రేణు దేశాయ్ ని ట్రోల్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంస్టాగ్రామ్ లో ఘాటు వ్యాఖ్యలు
ఓ అభిమాని వ్యాఖ్యలకు రిప్లై ఇస్తూ రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన విడాకుల ప్రస్తావన తీసుకుని వచ్చారు. రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేవిగా ఉన్నాయి.

మీరే నాకు కృతజ్ఞతగా ఉండాలి
నెగిటివిటీని భరించాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నేళ్ల పాటు విడాకుల విషయంలో సైలెంట్ గా ఉన్నా. అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే నాకు కృతజ్ఞతగా ఉండాలి అని రేణు దేశాయ్ అన్నారు.

వాస్తవాలు బయట పెడితే
విడాకుల విషయంలో వాస్తవాలు బయట పెడితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు గర్వభంగం కలుగుతుందని రేణు దేశాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ ఏడుపు గొట్టు కామెంట్స్ ఆపండి అని సూచించారు. సోషల్ మీడియాలో తన పని గురించి మాత్రమే వచ్చే కామెంట్స్ చదువుకునే రోజు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.

కాబోయే భర్త వివరాలు గోప్యంగా
రేణు దేశాయ్ తన కాబోయే భర్త వివరాలని గోప్యంగా ఉంచారు. వివాహం తరువాత వెల్లడిస్తానని ఇటీవల సోషల్ మీడియా చాట్ లో తెలిపారు.


Click it and Unblock the Notifications











