హత్య చేస్తానంటూ తాప్సీ సంచలనం... రేణు దేశాయ్ అలా!
హైదరాబాద్: నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ వివరాలు బయటకు వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా పలువురు మండిపడ్డారు. సినీ సెలబ్రిటీలు ముఖేష్ సింగ్ తీరుపై దుమ్మెత్తి పోసారు. అతన్ని హత్య చేస్తానంటూ తాప్సీ వ్యాఖ్యానిస్తే....అతని ఇంటర్వ్యూ తీసుకోవడంపై రేణు దేశాయ్ మండి పడింది.
‘ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు' అంటూ ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారత కూతురు' పేరుతో మార్చి 8న ఎన్‌డీటీవీలో రానున్న డాక్యుమెంటరీలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు.

‘ముఖేష్ ఇంటర్వ్యూ చదివాక ఒక్కసారిగా మాట పడిపోయింది. దేవుడా ఒక్క హత్య చేస్తాను నన్ను క్షమించు, వాడిని ఊరికే వదలకూడదు' అంటూ తాప్సీ తీవ్రంగా స్పందించింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా? అనే అనుమానం వస్తోంది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు? అని ప్రశ్నించింది.
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కూడా నిర్భయ దోషి ముఖేష్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. 'అత్యాచారంపై మీ అభిప్రాయం ఏమిటి? రేపిస్టు తన ఇంటర్వ్యూలో చెప్పిన అంశంతో మీలో ఎంతమంది రహస్యంగా ఏకీభవిస్తారు? అత్యాచారంలో నిజంగా మహిళల తప్పు ఉంటుందా?' అంటూ సూటిగా ప్రశ్నలు సంధించింది.
వెన్నెల కిషోర్ స్పందిస్తూ....‘రేపిస్టుకు కుర్చీవేసి కూర్చోబెట్టి.. ఇంటర్వ్యూ చేయడం నిజంగా నమ్మలేకపోతున్నానని, అతడు జైల్లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకొంటున్నాడు' అంటూ ఫైర్ అయ్యారు.


Click it and Unblock the Notifications











