బర్త్ డే గిఫ్ట్: పవన్‌‌ కళ్యాణ్ జ్ఞాపకాలతో రేణుదేశాయ్

By Bojja Kumar

హైదరాబాద్: పవణ్ కళ్యాణ్‌తో విడిపోయినా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ అతని జ్ఞాపకాలతో జీవిస్తోందని స్పష్టమవుతోంది. రేణు దేశాయ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ఇష్క్ వాలా లవ్' చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది.

పవన్ కళ్యాణ్‌తో విడిపోయినప్పటికీ అతనితో మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తోంది రేణు దేశాయ్. వాస్తవానికి 'ఇష్క్ వాలా లవ్' చిత్రం ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ''పవన్‌ కల్యాణ్‌ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం, కాస్త వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల రాలేకపోతున్నారు'' అంటూ రేణు దేశాయ్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు.

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

రేణు దేశాయ్

రేణు దేశాయ్

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

పవన్-రేణు దేశాయ్

పవన్-రేణు దేశాయ్

‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

సహజీవనం, వివాహం

సహజీవనం, వివాహం

పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడక తప్పలేదు. సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగింది.

ఇపుడు అలా...

ఇపుడు అలా...

నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు. తర్వాత ఆయనతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా, ఆద్యా అనే ఇద్దరు పిల్లకు తల్లయింది. ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమలో తన నిర్మాతగా, దర్శకురాలిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.

ఇష్క వాలా లవ్

ఇష్క వాలా లవ్

‘ఇష్క్ వాలా లవ్' బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. రేణు దేశాయ్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X