»   »  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన ట్వీట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుక సందర్భంగా ఇటీవల బెంగులూరులో మహిళలపై జరిగిన అరాచకం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో.... ట్విట్టర్ ద్వారా రేణు దేశాయ్ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశం అయింది.

బెంగులూరులో జరిగిన కీచక పర్వంపై ట్విట్టర్ ద్వారా చర్చ జరుగుతుండగా.... ఈ చర్చలో పాల్గొన్న అభిమాని ఒకరు ముందు సినిమాల్లో మహిళలపై హరాస్మెంట్ సీన్లు చూపించడం మానాలని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. అతని అభిప్రాయాన్ని సమర్ధిస్తూ రేణు దేశాయ్ ట్విట్ చేసారు. మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను... అంటూ నొక్కి వక్కానించారు.

 సినిమా వాళ్లు మారాలి

సినిమా వాళ్లు మారాలి

సినిమాల్లో మహిళలపై చూపించే హింసాత్మ, సెక్సువల్ హరాస్మెంట్ సీన్లు కూడా ఇలాంటి సంఘటనలు జరుగడానికి కారణం అవుతున్నాయని ఆమె చెప్పకనే చెప్పారు.

 బట్టలను సాకుగా చూపొద్దు

బట్టలను సాకుగా చూపొద్దు

మహిళల వస్త్రధారణ వల్లే ఇలాంటి సంగటనలు జరుగుతున్నాయనే వాదనను రేణు దేశాయ్ ఖండించారు. మహిళలు ఎలాంటి బట్టలు వేసినా కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ ఆమె ట్వీట్ చేసారు.

 అందరు మగాళ్లు అలా కాదు

అందరు మగాళ్లు అలా కాదు

అందరు మగాళ్లు చెడ్డ వారు అని నేను అనడం లేదు. అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చేస్తున్న వారి గురించే ఈ చర్చ అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.

అక్షయ్ కుమార్ ట్వీట్

బెంగులూరు ఘటనపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందిస్తూ.... ఓ వీడియో ట్వీట్ చేసారు. ఇది సిగ్గు పడాల్సిన ఘటన అంటూ ఆయన అన్నారు.

నాలుగేళ్ల పిల్లలను కూడా

నాలుగేళ్ల పిల్లలను కూడా

నాలుగేళ్ల పిల్లలను కూడా రేప్ చేస్తున్నారు ఇలాంటి వాళ్లని అలాగే వదిలేద్దామా? అంటూ ఘాటు స్పందించారు.

గ్రామాలు, చిన్న పట్టణాల్లో

గ్రామాలు, చిన్న పట్టణాల్లో

గ్రామాల్లో, చిన్న పట్టణాల్లోనే మహిళలపై ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి. అక్కడ అంతా లంగా ఓణి, సారీ దరిస్తారు. మహిళల వస్త్రధారణ మగాళ్ల మైండ్ సెట్ మారడానికి కారణం కాదు అని ఆమె అన్నారు.

గౌరవం ఇవ్వాలి

గౌరవం ఇవ్వాలి

కుటుంబంలో మహిళలకు గౌరవం ఇచ్చినపుడే ఆ ఇంట్లో పెరిగే యువతలో మహిళలపై గౌరవం పెరుగుతుంది అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

ఈ ట్వీట్స్ వాళ్ల మైండ్ సెట్ మారుస్తాయా?

ఈ ట్వీట్స్ వాళ్ల మైండ్ సెట్ మారుస్తాయా?

ఈ ట్వీట్స్ వల్ల వాళ్ల మైండ్ సెట్ మారుతుందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా...... లేదు, కానీ ఇలాంటి డిస్క్రషన్స్ వల్ల కొంతైనా మార్పు వస్తుంది. భవిష్యత్తులో మన సిస్టర్స్‌కు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉంటాయి అని ఆమె ట్వీట్ చేసారు.

అలా అనడానికి నువ్వెవరు

అలా అనడానికి నువ్వెవరు

ఓ వ్యక్తి.... ముందు గర్ల్స్ మైండ్ సెట్ మారాలి. వారికి ఇలాంటి బట్టలు వేసుకుని ఇలా ఎంజాయ్ చేయడం అవసరమా? అంటూ కామెంట్ చేసారు. దీనికి రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. మహిళలు ఎంజాయ్ చేయకూడదని డిసైడ్ చేయడానికి నువ్వెవరు? నువ్వు సాంప్రదాయ దుస్తవులైన లుంగి, పంచె కడుతున్నావా? అంటూ మండి పడ్డారు.

English summary
Former actress turned filmmaker Renu Desai has an important message for filmmakers in the wake of this horrible mass molestation issue and the moral policing that followed. In an early morning Twitter interaction with her followers today, Renu endorsed a fan’s opinion that filmmakers should first stop picturizing harassment scenes in movies and it will in turn bring down abuse on women in the society.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu