»   » రేణు దేశాయ్ అడిగిన ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా?

రేణు దేశాయ్ అడిగిన ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు, నిర్మాత రేణు దేశాయ్ శివరాత్రి సందర్భంగా చేసిన ట్విట్ ఫ్యాన్స్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఈ రోజు ఉదయమే ట్విట్టర్ ఓపెన్ చేసిన రేణు దేశాయ్ శివరాత్రి సందర్భంగా ఎంత మంది ఘన పదార్థాలు తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ రేపు(మంగళవారం) ఉదయం వరకు ఉపవాసం ఉంటున్నారు? అంటూ ఆమె ప్రశ్నించింది.

శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉంటారో మీలో ఎవరికైనా తెలుసా? ఈ ఉపవాసం వెనక ధార్మిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా?...... ఈ విషయం ఎంత మందికి తెలుసో చెప్పండి అంటూ రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా అభిమానులను అడిగారు.

శివరాత్రి ఉపవాసం...
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.

English summary
"Good morning:) so how many of you do fasting today? Just water& no solid food till tomorrow morning? And how many of know why we should be fasting today? The spiritual, religious and scientific reason?" Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu