»   » మగబుద్ది ఎటు పోతుంది? వాళ్ల చూపులే అంత!: రేణు దేశాయ్

మగబుద్ది ఎటు పోతుంది? వాళ్ల చూపులే అంత!: రేణు దేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహిళల వస్త్ర ధారణకు, మగాళ్ల ప్రవర్తనకు ఎటువం టి సంబంధం లేదు, మహిళలు ఎలాంటి బట్టలు వేసుకున్నా వారి ప్రవర్తన అలానే ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ అభిప్రాయ పడింది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం అంటూ ఓ ట్వీట్ చేసింది.

జీన్స్, స్లీవ్ లెస్ షర్ట్స్ లాంటి మోడ్రన్ డ్రెస్సులు వేయడం వల్లనే ఆడవారిపై దేశంలో అఘాయిత్యాలు పెరుగుతున్నాయనే వాదనను తన ట్వీట్ ద్వారా కొట్టి పారేసింది రేణు దేశాయ్. మగాళ్ల బుద్ది ఎప్పటికీ అంతే, ఆడవారి పట్ల వారి ప్రవర్తన ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉంటుందనే భావనను వ్యక్తం చేసింది.

వన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఆలోచనాత్మకమైన ట్వీట్స్ చేస్తుంటారు. అనవసర విషయాల జోలికి పోకుండా సామాజిక అంశాలు, సోషల్ రెస్పాన్సిబులిటీ, పాలిటిక్స్ లాంటి అంశాలపై ఆమె ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తుంటారు.

Renu Desai tweet about mens Behavior

గతంలోనూ ఆమె కొన్ని ఆలోచనాత్మక ట్వీట్ష్ చేసారు. స్కూల్ లో పిల్లలకు బయోలజీ, జామెట్రీ లాంటి వాటికంటే ముఖ్యంగా దయ, కరుణ, సాహసం లాంటివి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆమె ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ద్వారా ఈ కాలం పిల్లల్లో ఉండాల్సిన మంచి లక్షణాలు ఉండటం లేదని, సాహస వంతులుగా ఎదగడం లేదని స్పష్టం చేసారు. స్కూల్ లెవల్ నుండి ఇలాంటివి నేర్పిస్తే రేపటి తరం పిల్లలు ఆదర్శవంతంగా తయారవుతారని అంటోంది రేణు దేశాయ్. మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది.

English summary
"It's never about her clothes!It's always the eyes of the man! Always!" Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu