»   » పవన్ వెన్ను నొప్పితో రాలేక పోయారు (ఫొటో)

పవన్ వెన్ను నొప్పితో రాలేక పోయారు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రేణుదేశాయ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ చిత్రం 'ఇష్క్‌ వాలా లవ్‌' ఆడియో విడుదల సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ శుభాకాంక్షలు పంపించారు. నిజానికి మంగళవారం జరగాల్సి ఉన్న ఈ కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని రేణుదేశాయ్‌ ట్విట్టర్‌ ద్వారా ఇంతకు ముందు పేర్కొన్నారు. అయితే పవన్ వెళ్లలేదు.

దాంతో ఆమె ట్వీట్‌ చేస్తూ, ''పవన్‌ కల్యాణ్‌ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం, కాస్త వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల రాలేకపోతున్నారు''అంటూ పేర్కొన్నారు. పవన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ సంతకం చేసిన పాటల సీడీని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సినిమాను త్వరలో తెలుగులోకి అనువదించే ఆలోచనలో ఉన్నారు రేణుదేశాయ్‌.

టిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

Renu Desai tweet about pawan

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్. 'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Pawan Kalyan garu is shooting&having back pain.he is unable to travel tomo for audio release.his wishes for IWL team😊 <a href="http://t.co/NRh0JMjAaw">pic.twitter.com/NRh0JMjAaw</a></p>— renu desai (@renuudesai) <a href="https://twitter.com/renuudesai/statuses/491212560708812802">July 21, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

English summary
Renu desai tweeted: "Pawan Kalyan garu is shooting&having back pain.he is unable to travel tomo for audio release.his wishes for IWL team."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu