»   » ఇబ్బంది పడ్డ రేణు దేశాయ్, చిర్రెత్తి ఇలా ట్వీట్ చేసింది

ఇబ్బంది పడ్డ రేణు దేశాయ్, చిర్రెత్తి ఇలా ట్వీట్ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ట్రాఫిక్ సిగ్నల్ పడిన విషయం తెలిసి కూడా కొందరు మన వెనకాలే ఉండి అదే పనిగా హాన్ కొడుతూ ఉంటారు. అదే సమయంలో ట్రాఫిక్ జామ్ అయినా, మనం ముందుకు వెళ్లే పరిస్థితి లేక పోయినా హాన్ కొట్టి చిర్రెత్తిస్తుంటారు. అలాంటపుడు ఎంత కోపం వస్తుందో కొత్తగా చెప్పక్కర్లేదు.

Renu Desai tweet about Traffic Problems

ఇలాంటి అనుభవమే రేణు దేశాయ్ కి ఎదురైనట్లుంది. ఈ దేశంలో అనవసరంగా హారన్ కొట్టేవాళ్లు పెరిగి పోయారు. హారన్ కొడితే ఇంధనం త్వరగా అయిపోయేలా ఏర్పట్లు ఉంటే తప్ప ఇలాంటి వాళ్లను అరికట్టడం కష్టం అంటూ ఆమె ట్వీట్ చేసారు.

అదే సమయంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డు దాటే సమయంలో మీ తల్లిదండ్రులో, పిల్లలో రోడ్డు దాటుతున్నట్లు భావించి దయచేసి మీ కార్ లేదా బైప్ ఆపి వారికి సహకరించండి అని రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా కోరారు.

సామాజిక పరమైన అంశాలపై తనదైన శైలిలో స్పందించే రేణు దేశాయ్ కొందరు కావాలని క్రియేట్ చేసే ట్రాఫిక్ సమస్యలపై పై విధంగా స్పందించారు.

English summary
"When you see old ppl or kids trying to cross the road, just imagine them to be ur parents or kids& stop ur bike/car&let them cross...please" Renu Desai tweeted.
Please Wait while comments are loading...