»   »  జాగ్రత్త సుమీ: రేణు దేశాయ్‌‌కి అభిమానుల సూచనలు!

జాగ్రత్త సుమీ: రేణు దేశాయ్‌‌కి అభిమానుల సూచనలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రేణు దేశాయ్ తనకు సంబంధించిన, తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. సమ్మర్ మొదలైన నేపథ్యంలో రోడ్డు పక్కన అమ్మే చెరుకు రసం టేస్టును కూతురు ఆద్యకు రుచి చూపించడంతో పాటు...అందుకు సంబందించిన ఫోటోను పోస్టు చేసింది రేణు దేశాయ్.

‘మేమంతా కలిసి ఈ వేసవి కాలంలో తొలిసారిగా రొడ్డు పక్కన అమ్మే చెరుకు రసం రుచి చూసాం' అంటూ ట్వీట్ చేసింది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్టుకు అభిమానుల నుండి రకరకాలుగా స్పందన వచ్చింది. కొందరు సూపర్ అంటూ కామెంట్ చేస్తే, మరికొందరు రొడ్డు పక్కన అమ్మే ఇలాంటి వాటితో జాగ్రత్త, అందులో వేసే ఐస్ శుభ్రంగా ఉండదు, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందంటూ సూచనలు చేసారు. ఈ కామెంట్స్ పరిశీలిస్తే రేణు దేశాయ్ పట్ల అభిమానులు ఎంత అభిమానం ప్రదర్శిస్తున్నారో స్పష్టం అవుతోంది.

Renu Desai tweet bout Sugar Cane Juice

పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో వారిని వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెలుతూ ఆనందంలో ముంచెత్తుతోంది రేణు దేశాయ్. ఆమె అట్లాంటిస్, దుబాయ్ లాంటి విహార ప్రదేశాలకు పిల్లలతో కలిసి వెళ్లినట్లు ఆమె ట్వీట్స్ బట్టి తెలుస్తోంది.

ణు దేశాయ్ తన పిల్లలతో, నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రొఫెషన్ పరంగా సంతృప్తిగా కనిపిస్తున్నప్పటికీ.....ఆయన(పవన్ కళ్యాణ్)లేని లోటు ఉన్నటును ఆమె ఫీలవుతున్నట్లు ఇటీవల కాలంలో ట్విట్టర్లో వ్యాఖ్యలు చూస్తే స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి తన పిల్లలు అకీరా, ఆద్యాలను కలిసి వెలుతుంటారని, తన కోసం కాక పోయినా...పిల్లల కోసంమైనా ఆయన అప్పుడప్పుడు వస్తున్నందుకు రేణు దేశాయ్ సంతోషంగానే ఉందనేది ఆమె సన్నిహితులు చెబుతున్న మాట.

English summary
"We are enjoying the first glass of sugar cane juice, of this summer, on the roads...:))" Renu Desai tweeted.
Please Wait while comments are loading...