Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్కూల్ బుక్ పై సెక్సీ హీరోయిన్ ఫొటో...ప్రశ్నించిన రేణు దేశాయ్
హైదరాబాద్ : పూణేలోని ఓ స్కూల్ లో... రేణుదేశాయ్...మేనల్లుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అతనికి ఇచ్చిన స్కూల్ నోట్ బుక్ పై శిల్పాశెట్టి..ఫొటో ముద్రించి ఉంది. కుటుంబసభ్యులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ని ఈ అంశంపై ప్రశ్నస్తే...పిల్లలు టీవిల్లో ఆమెను చూస్తున్నప్పుడు పుస్తకం మీద చూస్తే తప్పేంటి అని బదులిచ్చారు. ట్విట్టర్ ద్వారా..రేణు దేశాయ్...ఈ విషయాన్ని తెలిపార. సన్నిలియోన్, బిపాసాబసు ఫొటోలు కూడా ఇంకా కొందరి పుస్తకాలపై ఉన్నాయట.
This
is
a
notebook
given
frm
a
reputed
school
of
my
nephew
for
9th
std!
&we
r
wondering
why
this
generation
is
weird😣
pic.twitter.com/ICtzHqn4FO
—
R
(@renuudesai)
June
7,
2015
పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.
'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. పవన్‌కల్యాణ్ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్ వాలా వ్ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది. రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా పరిచయం అవబోతోంది.
తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్. పవన్ వి, తనవి ఇద్దరూ ఆలోచనలు చాలా విషయాల్లో ఒకటే అని చెప్తోంది. మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.
రేణు మాట్లాడుతూ... ఏ బాధ్యతల్ని నిర్వర్తించినా వాటిని సమన్వయం చేసుకోవడంలోనే ఉంది కిటుకు. పనితో పాటూ పిల్లల బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని పక్కాగా సమన్వయం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది నా నమ్మకం. అందుకే పనిలో ఎంత బాధ్యతగా ఉంటానో, పిల్లలకు తగిన సమయం కేటాయించడంలోనూ అదే విధంగా వ్యవహరిస్తాను అందామె. అలాగే...జీవితం ఎవరికి వారు నిర్ఱయించుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను స్వీకరిస్తూ, సరికొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ వెళ్లినప్పుడే ఆనందంగా ఉండగలం. అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలం అని చెప్తున్నారామె.