twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ విషయమై రేణు దేశాయ్ ఘాటుగా కౌంటర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా రేణుదేశాయ్‌ తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్‌ వాలా లవ్‌' ప్రమోషన్ లో భాగంగానో లేక మరొక కారణంతోనో పవర్ ప్రస్దావన తెస్తోంది. ఇది కొంతమందికి నచ్చక...పవన్ ని ఇలా వాడుకుంటోందంటూ కామెంట్స్ చేసారు. దాంతో మండుకొచ్చిన రేణు దేశాయ్ ఘాటుగానే వారికి సమాధానమిచ్చింది.

    రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ... నేను పవన్ కళ్యాణ్ పేరుని వాడుకుంటున్నానని అనే వారు గమనించాల్సిన విషయం ఒకటుంది... నేను ఓ హిట్ సినిమా ని ఎవరి సహాయం లేకుండా క్రితం సంవత్సరం నిర్మించాను, ఈ విషయమై పవన్ కళ్యాణ్ గారు గర్వ పడ్డారు. అలాగే నేను మొదట ఓ ఫేమస్ మోడల్ ని, నటిని అన్న విషయం గుర్తించుకోవాలి. కాబట్టి మీరు ఇలా మాట్లాడటం మానేసి మీ ఆలోచనలతో ఏదన్నా సమాజానికి పనికి వచ్చే పని చేయండి అని ట్వీట్ చేసింది.

    Renu Desai twitter counter

    ఇక 'ఇష్క్‌ వాలా లవ్‌' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...

    ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్‌ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్‌ వాలా లవ్‌'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్‌ ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.

    ''నేను ముందుగా మాట ఇచ్చినట్లు ఈ రోజు తీపి కబురు చెబుతున్నా. నా కొడుకు అకిరా నందన్‌ 'ఇష్క్‌ వాలా లవ్‌'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తామని ఇదివరకే రేణు దేశాయ్‌ చెప్పారు. అంటే అకిరా నటనను తెలుగు తెరపైనా చూసే అవకాశముంది.

    English summary
    Renu Desai tweeted:" This is for the extra smart ppl who think I am using Pawan Kalyan's name to get famous...I produced a hit film last year without any help or support frm anyone, for which Kalyan garu is very proud of me... I have also been a famous model & actress before...so pls rest your over active brains and use that same energy for some social work..."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X