రేణు దేశాయ్ గురించి మరో ఊహాగానం!
రేణు దేశాయ్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పవన్ నుంచి విడిపోయి ఏడేళ్లయినా తరువాత రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కానీ తనకు కాబోయే భర్త వివరాలు మాత్రం ప్రకటించలేదు. రెండో వివాహ నేపథ్యంలో రెండు దేశాయ్ గురించి అనేక రకాల పుకార్లు, ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరిగింది.
ట్రోలింగ్ నుంచి బయట ఆపడడానికి రేణు దేశాయ్ ట్విట్టర్ ఖాతానే విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తాజగా రేణు దేశాయ్ గురించి మరో వార్త ప్రచారం జరుగుతోంది. రేణు దేశాయ్ వివాహం అనంతరం తిరిగి సినిమాల్లో నటించబోతోందట. ఇప్పటీకే సినిమా నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలని రేణు దేశాయ్ చేపడుతోంది.

నటిగా కూడా తిరిగి ప్రయాణం మొదలు పెట్టాలని రేణుదేశాయ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేక పుకారు మాత్రమేనా అనే సంగతి తేలాలంటే రేణు దేశాయ్ స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











