రేణు దేశాయ్ ఫీలింగ్స్, మీడియా తీరుపై ఆగ్రహం
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అనుభవాలను, ఫీలింగ్స్ అభిమానులతో పంచుకోవడంతో పాటు....అప్పుడప్పుడు కొన్ని సందేశాత్మక ట్వీట్స్ కూడా చేస్తోంది రేణు దేశాయ్. అయితే తను చేసిన వ్యాఖ్యాలను మీడియా వారు తన గత జీవితంతో ముడి పెట్టి వార్తా కథనాలు రాయడం రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇటీవల ఆమె తన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘కలవడం వల్ల వచ్చే సంతోషం ఎక్కవా లేక విడిపోవడం వల్ల కలిగే బాదా? జీవితం అయోమయంగా ఉంది.' అంటూ ట్వీట్ చేసింది. మరి రేణు దేశాయ్ ఇలాంటి ట్వీట్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో? అంటూ వార్తా కథనాలు వెలు వడ్డాయి.

ఆ సంగతి పక్కన పెడితే రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క వాలా లవ్' ఇంకా విడుదలకు నోచు కోవడం లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా....ఇప్పటికీ విడుదల కాలేదు.


Click it and Unblock the Notifications











