For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గబ్బర్ సింగ్' సినిమాని 60 సార్లు పైగా చూసా

    By Srikanya
    |

    హైదరాబాద్ : పూర్తి స్ధాయిలో గీతలు పడేదాకా 'గబ్బర్ సింగ్' డీవిడీ చూస్తూనే ఉన్నాం ..దాదాపు అరవై సార్లకు పైగా ఆ చిత్రం చూసాను అంటున్నారు రేణుదేశాయ్. ఆమె తనకు పవన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్తూ తమ పిల్లలు తమ తండ్రి నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఎప్పుడూ చూస్తూనే ఉంటారని ఆమె అన్నారు. అలాగే... అత్తారింటికి దారేది సినిమా అయితే 20 సార్లుకు పైగా చూసాను అన్నారామె.

    'ఇష్క్‌ వాలా లవ్‌' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు. అక్టోబర్ 24 న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...

    Renu Desai watched GS until DVD scratches

    ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్‌ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్‌ వాలా లవ్‌'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు.

    '' నా కొడుకు అకిరా నందన్‌ 'ఇష్క్‌ వాలా లవ్‌'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ అన్నారు రేణు దేశాయ్‌

    అలాగే ఆమె మాట్లాడుతూ... కల్యాణ్‌బాబు ఒకటే చెప్పారు.. ‘ఏదైనా సమస్య ఉంటే నేనున్నాను' అని. నిర్మాతగా నా మొదటి సినిమాకు ఎలాంటి సమస్యా రాలేదు. అలాగే ఇప్పుడు ‘ఇష్క్‌ వాలా లవ్‌'ను కూడా ఇప్పటి దాకా ఎలాంటి సమస్య లేకుండా హాయిగా పూర్తిచేశాం. మరాఠీలో మంచి డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేశారు. తెలుగులో కూడా బాగా రిలీజ్‌ కాబోతోంది. ప్రస్తుతం ఆయన సపోర్ట్‌ తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదు అన్నారామె.

    English summary
    Renu Desai said 'Of course. I saw Gabbar Singh 60 times for sake of my children as they feel like watching their father’s films! We watched the film so many times that the DVD got scratches as well. We watched Attarintiki Daaredhi at least 20 times!'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X