వైరల్ పిక్స్ : ఫారెన్ లో రేణుదేశాయ్ ..ఎట్టకేలకు అకిరా సీక్రెట్ బయటకు.. ముగ్గురూ ఒకేలా!
Recommended Video

త్వరలో రెండో వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణు దేశాయ్ ఫారెన్ లో సంతోషంగా విహరిస్తోంది. తన పిల్లలు అకిరా నందన్, ఆధ్యతో కలసి రేణుదేశాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ నుంచి కొన్ని అందమైన దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రేణు దేశాయ్ తనకు కాబోయే భర్త విషయంలో గోప్యత పాటిస్తోంది. వివాహం అనంతరం అతడి వివరాల్ని తెలియజేస్తానని ప్రకటించింది.

ఫారెన్ టూర్
ఇటీవలే రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం రేణు దేశాయ్ తన పిల్లలని తీసుకుని ఫారెన్ టూర్ వెళ్ళింది. అకిరా అధ్యతో కలసి ఈ సమయాన్ని రేణు దేశాయ్ సంతోషంగా గడుపుతోంది.

ఫారెన్ టూర్
ఇటీవలే రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం రేణు దేశాయ్ తన పిల్లలని తీసుకుని ఫారెన్ టూర్ వెళ్ళింది. అకిరా, అధ్యతో కలసి ఈ సమయాన్ని రేణు దేశాయ్ సంతోషంగా గడుపుతోంది.

ముగ్గురూ ఒకే పద్ధతి
రేణు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది. వారు ధరించిన డ్రెస్ కలర్ కు అనుగుణంగానే అదే కలర్ లో ఉండే టోపీ, షూలని ధరించారు. అకిరా రెడ్, రేణు దేశాయ్ ఆరెంజ్, ఆధ్య బ్లూ కలర్స్ లో డ్రెస్సులు, టోపీ, షూ ధరించి ఉన్నారు.
సీక్రెట్ బయటకు
అకిరా నందన్ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. పవన్, రేణు దేశాయ్ తనయుడు కావడం అటుంచితే, అతడి పొడవు అభిమానులని సైతం షాక్ కి గురిచేస్తోంది. అకిరా ఎంత హైట్ ఉన్నాడనే సీక్రెట్ ని రేణు దేశాయ్ ఎట్టకేలకు రివీల్ చేసింది. అకిరా పొడవు 6.3 అడుగులు. అది కూడా కేవలం 14 ఏళ్ల వయసులోనే.
ముద్దొచ్చే కుక్కతో
ఆధ్య ముద్దొచ్చే తన కుక్కతో ఆడుకునే ఫోటోలని కూడా రేణు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు కుడా వైరల్ గా మారాయి. రేణు దేశాయ్ వివాహం ఎప్పుడు జరగబోతోంది, కాబోయే భర్త ఎవరు అనే విషయాల గురించి నెటిజన్లలో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











