వాగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తుందట.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫోటో షూట్లు, తన ప్రాజెక్ట్‌లు, పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. నెటిజన్లతో లైవ్ చాట్ చేస్తుంది. అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇక నెగెటివ్ కామెంట్లకు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అప్పట్లో రెండో పెళ్లి విషయం, పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడం ఎంతగా వైరల్ అయిందో.. వాటికి రేణూ దేశాయ్ చెప్పిన సమాధానాలు కూడా ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే.

హైద్రాబాద్‌కు మకాం..
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణూ దేశాయ్ పుణెలో సెటిలైంది. అయితే చాలా రోజులు అక్కడే ఉంది. పిల్లలతో పుణెలోనే ఉంటున్న రేణూ.. ఓ ప్రాజెక్ట్ కోసం తరుచూ హైద్రాబాద్ రావాల్సి వచ్చేది. రైతు నేపథ్యంలో ఓ కథను రెడీ చేసే పనిలో హైద్రాబాద్‌కే మకాం మార్చేసింది.

బుల్లితెరపై రేణూ..
వెండితెరపై రేణూ దేశాయ్ కనిపించక కొన్నేళ్లు అవుతంది. పవన్ నుంచి విడాకులు తీసుకున్నాక.. బుల్లితెరపై ఓ షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. ఆపై ఓ కామెడీ సీరియల్‌లొ నటిస్తోంది. సునయనతో కలిసి చేస్తోన్న ఈ ప్రోగ్రాం బాగానే క్లిక్ అయింది.

పిజ్జా, పానీపూరిలపై మక్కువ..
ఈ మధ్య రేణూ దేశాయ్ వరుసగా పోస్ట్‌లు చేస్తోంది. ఎవరైనా పానీ పూరి, పిజ్జాల గురించి చెబుతూ ఉండగా తాను వింటే తన ఎక్స్‌ప్రెషన్ మారిపోతుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక ఆద్య పనితనం కూడా అందరికీ తెలిసేలా చేసింది. ఆమె కేక్ తయారు చేస్తే దొంగిలించి మరీ తినే అంత టేస్టీగా ఉంటుందట.

చేతిలో గన్ పట్టుకున్నట్టుగా..
తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అది చూస్తే ఎవ్వరైనా సరే పరేషాన్ అవ్వాల్సిందే. యంగ్ హీరోయిన్‌లకు పోటీ ఇచ్చేలా ఉన్న రేణూ దేశాయ్ ఫోటోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. చేతిలో గన్ను పట్టుకుని రేణూ దేశాయ్ అందర్నీ బోల్తా కొట్టిస్తోంది.
Recommended Video

పిట్టల్ని కాల్చినట్టు..
రేణూ దేశాయ్ చేతిలో ఉన్నది కెమెరాను పెట్టుకునే ట్రైపాడ్.. కానీ గన్ను మాదిరిగా పట్టుకుని రేణూ దేశాయ్ అందర్నీ బెదరగొడుతోంది. వాగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా.. కానీ పిట్టల్ని మాత్రం కాల్చను అని పెట్టిన ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు అవును అన్నట్టుగా రేణూ దేశాయ్ తెగ నవ్వేసింది.


Click it and Unblock the Notifications











