»   » మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్న రేణు దేశాయ్, అందరిలోనూ ఆసక్తి!

మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్న రేణు దేశాయ్, అందరిలోనూ ఆసక్తి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'బద్రి' సినిమాలో నటించిన తర్వాత రేణు దేశాయ్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. నటిగా ఎదగాలనుకున్న ఆమె పవన్ కళ్యాణ్ ప్రేమకు బందీ అయిపోయింది. ఆయన కోసం సినిమాలను వదిలేసింది, తన జీవితంలో ఇంకా ముఖ్యమైనవి ఎన్నో త్యాగం చేసింది. తర్వాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ప్రియురాలిగా, భార్యగా ఉన్నంత కాలంగా ఎప్పుడూ మీడియా ముందుకు రాని రేణు దేశాయ్... ఆయతో విడిపోయిన తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయట పెట్టారు.

 మరో సంచలన ఇంటర్వ్యూకు సిద్ధం

మరో సంచలన ఇంటర్వ్యూకు సిద్ధం

పవన్ కళ్యాణ్ గురించి, తన జీవితం గురించి, పిల్లల గురించి... తాను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు, చేదు అనుభవాలు అన్ని విషయాలు గత ఇంటర్వ్యూల్లో రేణు దేశాయ్ బయట పెట్టారు. త్వరలో రేణు దేశాయ్ మరో సంచలన ఇంటర్వ్యూకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా ఆ ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది.

ఫెయిల్యూర్స్ మీద

ఫెయిల్యూర్స్ మీద

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ దర్శకురాలిగా, నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె దర్శకత్వం వహించిన సినిమాతో పాటు, నిర్మాతగా నిర్మించిన సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాను నటుడిగా పరిచయం చేసిన సినిమా ‘ఇష్క వాలా లవ్' అలా కావడంపై అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ సినిమా కనీసం తెలుగులో విడుదలకు కూడానోచుకోలేదు. ఈ విషయాలపై రేణు దేశాయ్ మాట్లాడే అవకాశం ఉంది.

ఇంకా ఏం చెప్పబోతోంది?

ఇంకా ఏం చెప్పబోతోంది?

రేణు దేశాయ్ ఈ ఇంటర్వ్యూలో ఇంకా ఏం విషయాలు బయట పెట్టబోతోంది? పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఏమైనా సంచలన విషయాలు, ఆసక్తికర విషయాల, ఇప్పటి వరకు వరకు రాని విషయాలు ఈ ఇంటర్వ్యూలో మన తెలుసుకోబోతున్నామా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో.. అంటూ గత ఇంటర్వ్యూలో రేణు దేశాయ్

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో.. అంటూ గత ఇంటర్వ్యూలో రేణు దేశాయ్

రేణు దేశాయ్ తన గత ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో.. అంటూ పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Renu Desai womensday interview with Prema releasing on 8th March. Renu is expected to reveal a lot of things including the failure of her directorial debut "Ishq Wala Love" that marked the acting debut of Jr Pawan Akira.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu