»   »  రేణు దేశాయ్ సంతోషంగానే..., కానీ ఆయన లేని లోటు!

రేణు దేశాయ్ సంతోషంగానే..., కానీ ఆయన లేని లోటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యాలతో కలిసి పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో వారిని వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెలుతూ ఆనందంలో ముంచెత్తుతోంది. ఆమె అట్లాంటిస్, దుబాయ్ లాంటి విహార ప్రదేశాలకు పిల్లలతో కలిసి వెళ్లినట్లు ఆమె ట్వీట్స్ బట్టి తెలుస్తోంది.

Renu Desi spending some quality time with the kids

ట్విట్టర్లో ఎప్పికప్పుడు పోస్టులు చేస్తూ అభిమానులతో తన జీవితంలోని క్షణాలను షేర్ చేసుకుంటోంది. పైకి రేణు దేశాయ్ తన పిల్లలతో, నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రొఫెషన్ పరంగా సంతృప్తిగా కనిపిస్తున్నప్పటికీ.....ఆయన(పవన్ కళ్యాణ్)లేని లోటు ఉన్నటును ఆమె ఫీలవుతున్నట్లు ఇటీవల కాలంలో ట్విట్టర్లో వ్యాఖ్యలు చూస్తే స్పష్టమవుతోంది.

పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి తన పిల్లలు అకీరా, ఆద్యాలను కలిసి వెలుతుంటారని, తన కోసం కాక పోయినా...పిల్లల కోసంమైనా ఆయన అప్పుడప్పుడు వస్తున్నందుకు రేణు దేశాయ్ సంతోషంగానే ఉందనేది ఆమె సన్నిహితులు చెబుతున్న మాట.

English summary
Renu Desi is spending some quality time with the kids in Atlantis, Dubai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu