కాపీకి..మహాత్మ కౌంటర్
జనంలోంచి పుట్టిందే జాన పదమని, పల్లెప్రజలు నాట్లు వేసు కుంటూ, వరికోతల సమ యం లో పాడుకునే పాటను తన పాట గా చెప్పుకోవడం అవుదుర్తి లక్ష్మ ణ్‌కు తగదని 'మహాత్మ' గేయ రచయిత కాసర్ల శ్యాం అన్నారు.
'మహాత్మ సినిమా వారు నా పాటను దొంగిలించారు. 2005 నుంచి బహుళ జనాదరణ పొందిన నా పాటను ఇష్టారీతిగా వాడుకున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటల సీడీలో రచయిత పేరు ముద్రించకుండా పాట వాడు కోవడం వారి చర్యను నిర్ధారిస్తున్నదని ప్రముఖ జానపద గాయకుడు, రచయిత అవుదుర్తి లక్ష్మణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా 'మహాత్మ' గేయ రచయిత కాసర్ల శ్యాం సమాదానిచ్చారు. ఇక మగధీర సమయంలోనూ వంగపండు తన పాటను వాడుకున్నారంటూ మగధీర నిర్మాతపై దండెత్తిన సంగతి తెలిసందే.
ఇక శ్రీకాంత్, కృష్ణవంశి కాంబినేషన్లో వస్తున్న ఈ మహాత్మ చిత్రం సెన్సార్ పరంగా ఇప్పటికే చిక్కులను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ కొత్త వివాదం తోడయ్యంది.


Click it and Unblock the Notifications











