గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో సినిమా

By Srikanya

జంగారెడ్డిగూడెం : నిజాయతీ, అంకితభావంతో పని చేసే ఒక గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న 'రిపోర్టర్‌' చిత్రంలో నటిస్తున్నానని 'నంది' అవార్డు గ్రహీత, గంగపుత్రులు హీరో రాంకీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో రిపోర్టర్‌ చిత్ర దర్శకులు, హీరో, హీరోయిన్మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలు తెలియచేసారు.

Reporter Film on Rural Journalism

ఈ సందర్భంగా హీరో రాంకీ మాట్లాడుతూ జి.ఆర్‌.కె.ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. హీరోయిన్ గా దీక్షా పంథ్‌, మరో హీరోయిన్ గా సునీతారాణి, క్యారెక్టర్‌ నటులు నాగినీడు, చలపతిరావు తదితరులు నటిస్తున్నారన్నారు. అలాగే తమ సినిమాలో బయ్యిన్నగూడెం గ్రామంపై ఓ పాట ఉంటుందన్నారు. అందువలనే ఈ పాటను ఇక్కడ షూట్ చేస్తున్నామన్నారు .

హీరోయిన్ దీక్షాపంధ్ మాట్లాడుతూ...తనకు రిపోర్టర్ సినిమా మూడవ చిత్రమని, ఈ చిత్రంలో తాను రిపోర్టర్ పాత్రను పోషిస్తున్నాని అన్నారు. ఇప్పటివరకూ వయా పాపికొండలు,మస్తి చిత్రాల్లో నటించానని అన్నారు. ఆ సినిమాలు ఇంకా విడుదల కావల్సి ఉందని చెప్పుకొచ్చారు.

డైరక్టర్ కత్తి మహేష్ కుమార్ మాట్లాడుతూ...తనకు జర్నలిజం పై ఎంతో అవగాహన ఉందని అన్నారు. వెబ్ మీడియాలో పనిచేసిన అనుభవం తనకు ఉందని ఆ అనుభవంతోనే గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలపైనే రిపోర్టర్ చిత్రం చిత్రీకరిస్తున్నామని చెప్పారు.

ప్రముఖ క్యారెక్టర్‌ నటుడు నాగినీడు మాట్లాడుతూ... పౌరాణిక పాత్రలలో నటించాలని ఉందని వెల్లంకి పేర్కొన్నారు. 'చెన్నకేశవరెడ్డి' చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశా. 'మర్యాద రామన్న' చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు 20 చిత్రాలలో నటించా. ప్రస్తుతం వెంకటేష్‌ నటిస్తున్న షాడో, ప్రభాస్‌ నటిస్తున్న మిర్చి, శుశాంత్‌ నటిస్తున్న అడ్డా, చైతన్య నటిస్తున్న కాళీచరణ్‌ చిత్రాలలో నటిస్తున్నా. తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలలో నటిస్తు. నటుడిని కాకముందు కూడా నేను సినీరంగంలోనే ఉన్నా. సినిమాలకు ఎంత పోటీ ఉన్నా ఆదరణ బాగుంది. ఇదే ఆదరణ కొనసాగాలి' అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి మహేష్‌ కత్తి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్‌ జోష్యిభట్ల రాజశేఖరశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయి. ప్రస్తుతం బయ్యనగూడెంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. మిగిలిన చిత్రాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X