Republic day 3 Collections: సాయి ధరమ్ తేజ్ లేకుండా సెలబ్రేషన్స్ చేసుకోలేము.. ఏదైనా అతను వచ్చిన తర్వాతే..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల అనంతరం హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న సాయి మెల్లగా కోలుకుంటున్నాడు. ఇక ఇటీవల సోషల్ మీడియా ద్వారా అంతా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. దీంతో అభిమానులు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో సాయి ధరమ్ మొదట బాగానే పాల్గొన్నారు. అయితే కరెక్ట్ గా విడుదల సమయానికి యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్ లో ఉండడం చాలా నిరాశ కలిగించింది. ఇక చిత్ర యూనిట్ ఇటీవల ఒక విషయం పై క్లారిటీ ఇచ్చిన ప్రయత్నం చేసింది.

 సినిమా రిజల్ట్ పై సంతోషంగా

సినిమా రిజల్ట్ పై సంతోషంగా

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా టాక్ ను అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మాంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఉంది శని ఆది వారాల్లో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అయితే ఈ సినిమా రిజల్ట్ పై చాలా సంతోషంగా ఉంది.

 చేదు అనుభవం

చేదు అనుభవం

అయితే ఏ సినిమా అయినా సరే విడుదల అవుతున్న సమయంలో హీరో తో పాటు నటీనటులు చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్ గా ప్రమోషన్లో పాల్గొంటూ ఉంటారు. అయితే రిపబ్లిక్ సినిమా విషయంలో సాయి ధరమ్ తేజ్ మాత్రం చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. సినిమా విడుదలయ్యే సమయానికి యాక్సిడెంట్ వల్ల ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కొంత వరకు కోలుకున్నప్పటికి కూడా ప్రమోషన్లో పాల్గొనేంత సెట్ అవ్వలేదని తెలుస్తోంది.

 అది ఈ రోజు నిజమైంది

అది ఈ రోజు నిజమైంది

ఇక చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'సాధారణంగా ఓ సినిమాను చూసినప్పుడు మంచి సినిమా చూశామనే ఆలోచన సమాజం పట్ల బాధ్యత ఆశ నమ్మకాన్ని కలిగించడమనేది అరుదుగా జరిగే విషయం. మేం నిర్మించిన రిపబ్లిక్ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తుంది. రిపబ్లిక్ సినిమాను నిర్మించినందుకు జీ స్టూడియోస్ గర్వంగా ఫీల్ అవుతుంది. సినిమాపై మేం ఎలాంటి నమ్మకాన్ని ఉంచామో అది ఈరోజు నిజమైంది. సాయి తేజ్, డైరెక్టర్ దేవ కట్టా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈ సినిమాలో భాగమయ్యారు'. అని తెలిపారు.

ఆయన లేకుండా సెలబ్రేట్ చూసుకోలేము

ఆయన లేకుండా సెలబ్రేట్ చూసుకోలేము

అలాగే రిపబ్లిక్ బ్లాక్ బాస్టర్ లో భాగమైన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్, మీడియా, ఇతర భాగస్వామ్యులకు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. నిజానికి ఇలాంటి గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత సక్సెస్ పార్టీని చేసుకోవాలి. కానీ సాయి తేజ్ గారు ఇంకా కోలుకుంటున్నారు. ఆయన లేకుండా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం సరైనది కాదని మేం భావిస్తున్నాం. సాయి తేజ్ గారు చాలా త్వరగా కోలుకోవడం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాం.. అని రిపబ్లిక్ నిర్మాతలు వివరణ ఇచ్చారు.

మూడు రోజుల్లో..

మూడు రోజుల్లో..

ఇక రిపబ్లిక్ సినిమా 3 రోజుల్లో ఎపి తెలంగాణలో 4.45 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది. మొదటి రెండు రోజుల్లో కాస్త బాగానే వసూళ్లను రాబట్టిన రిపబ్లిక్ మూడవ రోజు ఏపీ తెలంగాణలో 1.85 కోట్ల షేర్ ను అందుకుంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రిపబ్లిక్ సినిమా 5.07 కోట్ల షేర్ ను అందుకుంది.

Recommended Video

Director Deva Katta Interview About Republic Movie | Sai Dharam Taj
లాభల్లోకి రావాలి అంటే..

లాభల్లోకి రావాలి అంటే..

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల బిజినెస్ చేయగా 12.5కోట్లు ఎంతో మార్కెట్ లోకి అడుగుపెట్టింది మొత్తానికి 5.07 కోట్ల షేర్ రావడంతో బాక్సాఫీస్ టార్గెట్ కొంత హై లోనే ఉందని చెప్పవచ్చు. సినిమా హిట్ అవ్వాలంటే మరొక 7.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. సోమ వారం కలెక్షన్స్ రిపబ్లిక్ సినిమాకు చాలా కీలకం కానున్నాయి. ఈ రోజు నుంచి వసూలు పెరిగితే ఈజీగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X