RepulicDay2020: నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.. సూపర్ స్టార్ సహా ప్రముఖుల విషెస్

2020 రిపబ్లిక్ డేను దేశమంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటోంది. స్వాత్రంత్ర సమరయోధులను, రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ మూడు రంగుల జెండాను ఆకాశంలో రెపరెపలాడిస్తున్నారు దేశ ప్రజలు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తమ తమ సందేశాలు పోస్ట్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..

మువన్నెల జెండా.. నాగార్జున పోస్ట్

దేశంలోని వీధి వీడినా మువన్నెల జెండా రెపరెపలాడుతుండటం ప్రతీ భారతీయుడు హృదయాన్ని ఉత్తేజభరితం చేస్తోంది. ఈ సందర్బంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆ జెండా పిక్చర్ పోస్ట్ చేస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

యంగ్ హీరో నాగశౌర్య ట్వీట్


భారత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గ్రేట్ ఫెల్లోస్ అందరికీ సెల్యూట్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో నాగశౌర్య ట్వీట్ చేశారు.

భారతీయులందరికీ అల్లు అర్జున్ సందేశం

మువ్వన్నెల మూడు రంగుల జెండా పిక్ పోస్ట్ చేస్తూ భారతీయులందరికీ రిపబ్లిక్ డే విషెష్ తెలిపారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల.. వైకుంఠపురములో విజయంలో ఆనందంలో ఉన్న ఈ హీరో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు.

సైనికులతో మహేష్.. మనసుకు హత్తుకునే ట్వీట్

ఇక ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సైనికుడిగా కనిపించిన మహేష్ బాబు.. రిపబ్లిక్‌ డే సందర్భంగా సైనికులతో కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ''ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఒకటి'' అంటూ ట్వీట్ చేశారు.

మనం ముందుకు నడవాల్సిన సమయం

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ సోషల్ మీడియా వేదికగా గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ''ఈ ఏడాది మనం కోరుకుంటున్న మార్పు వస్తుందని ఆశిద్దాం. మన దేశం ఎప్పటిలాగే జాతి, మత, వర్గ విభేదాలు లేని ఏకీకృత, లౌకిక దేశంగా ఎదగాలని కోరుకుందాం. 2020.. ఇది మనం ముందుకు నడవాల్సిన సమయం'' అని పేర్కొంది.

Recommended Video

Actor Sunil & Rana Daggubati Must Learn From Mahesh Babu - Imandi Ramarao
రిపబ్లిక్ డే 2020

రిపబ్లిక్ డే 2020


కేవలం టాలీవుడ్ ప్రముఖులే గాక దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం #RepulicDay2020 హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X