»   » అమీర్ ఖాన్ ట్వీట్ కు సర్వర్‌ క్రాష్‌...

అమీర్ ఖాన్ ట్వీట్ కు సర్వర్‌ క్రాష్‌...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఆమిర్‌ ఖాన్‌ వంటి సూపర్‌ స్టార్‌ ప్రకటన ఇస్తే స్పందన ఏ రేంజిలో ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఆ దర్శకుడు కు అర్దమైంది. ఈ మధ్యనే తమ ప్రొడక్షన్స్‌కి అందంగా ఉండి చక్కగా పాడగల టీనేజీ అమ్మాయి కావాలంటూ ఇటీవల ఆమిర్‌ తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేశారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు దీనికి స్పందించి అడిగిన వివరాలను మెయిల్‌కు పంపడంతో ఆఫీస్‌ సర్వర్‌ క్రాష్‌ అయ్యిందట.

ప్రకటనకు ఇంతటి భారీ స్పందన రావటం నిజంగా ఉత్తేజాన్ని కలిగించిందని ఆమిర్‌ఖాన్‌, ప్రొడక్షన్స్‌ డైరెక్టరు అద్వైత్‌ చందన్‌ అన్నారు. అభ్యర్థులు మెయిల్‌ ద్వారా పంపిన వివరాలను డౌన్‌లోడ్‌ చేయడానికి రాత్రుళ్లు శ్రమించాల్సి వస్తోందని చందన్‌ తెలిపారు.

ఎంచుకున్న వారికి త్వరలోనే ఆడిషన్స్‌ కోసం సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ సినిమాతో చందన్‌ దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోనున్నారు. అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలను ఆమిర్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారిని హిందీలో తమకు ఇష్టమైన ఓ పాటను పాడి ఈ మెయిల్‌కు జత చేయమంటూ మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Response to Aamir Khan’s casting tweet makes server crash

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ చిత్రంలో నటించమంటే అందరికీ ఆసక్తే.అలాంటి అవకాసం వస్తే ఎవరు కాదంటారు. అలాంటి అవకాసమే ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది.

తన ప్రొడక్షన్‌ హౌస్‌కి అందంగా ఉండి చక్కగా పాడగల టీనేజి అమ్మాయి కావాలంటూ ఆమిర్‌ ఖాన్‌ తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలను ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న వారు తమకు ఇష్టమైన ఓ హిందీ పాటను పాడి ఈమెయిల్‌కి జతచేయాలని కోరుతూ ఓ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారు. ఆ మెయిల్ ఎడ్రస్ ఏమిటంటే... casting@akpfilms.com .

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

12-17 సంవత్సరాల మధ్య వయస్సు బాలికలు తమ తల్లిదండ్రులతో సంతకం చేయించిన పరిచయ పత్రాన్ని జతపరుస్తూ వివరాలు పంపాలని ఆమిర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. 2001లో ప్రారంభించిన ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ దర్శీల్‌ సఫారీ, ప్రతీక్‌ బబ్బర్‌ వంటి నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది.

అమీర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

Response to Aamir Khan’s casting tweet makes server crash

దంగాల్ అనే మూవీలో రెజ్లర్ గా కనిపించబోతున్నారు ఆమిర్ ఖాన్... ఇందుకోసం తన బాడీని బాగా బిల్డప్ చేశారు. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మహావీర్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం మల్లికా శెరావత్ కి దక్కనుందని సమాచారం.

ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట. మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట.

ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్యఅనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

English summary
Overwhelming response to actor-producer Aamir Khan’s tweet regarding a casting call for a new production led to the server of his office to crash. Advait Chandan, who is directing the project, says it’s “really exciting”.
Please Wait while comments are loading...