ఉన్న మాటేగా అన్నా.. సీరియస్ అవ్వాల్సింది ఏముంది.. బాహుబలి నిర్మాతకి రసూల్ కౌంటర్!

రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మీద ఇండియన్ టెక్నీషియన్, సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ అయిన రసూల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనగా మారుతున్నాయి. ఆర్ఆర్ ఒక గే సినిమా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఘాటుగా స్పందిస్తూ కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఆ ట్వీట్కు మరో సారి రసూల్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

ప్రకంపనలు

ప్రకంపనలు

రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ ప్రధాన పాత్రధారులుగా కనిపించిన ఈ సినిమాను సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సుమారు 1130 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది.

 గే స్టొరీ అంటూ

గే స్టొరీ అంటూ

అనేక దేశాల్లో ఈ సినిమా చూసిన వారంతా సినిమా అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మీద మునీష్ భరద్వాజ్ అనే వ్యక్తి సినిమా ఏమీ బాగోలేదు అంటూ కామెంట్ చేయడంతో దానికి రసూల్ కూడా స్పందించాడు. ఇది ఒక గే స్టొరీ అంటూ ఆయన పేర్కొన్నాడు. దీంతో పెద్ద ఎత్తున ఈ వ్యవహారం మీద రచ్చ మొదలైంది.

తీవ్ర వ్యాఖ్యలు

తీవ్ర వ్యాఖ్యలు

దీంతో మునీష్ భరద్వాజ్ కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనాన్ని ఉద్దేశించి నువ్వు ఈ మాటలు మాట్లాడావా అని రసూల్ ని ప్రశ్నించడంతో రసూల్ కూడా అవును నేను అదే ఉద్దేశంతో మాట్లాడాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు అయితే ఈ విషయం మీద బాహుబలి నిర్మాత శోభయార్లగడ్డ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన కామెంట్స్ ను సమర్థిస్తూనే దానికి కౌంటర్ ఇచ్చారు.

నా ఉద్దేశం ఏమీ లేదంటూ

నా ఉద్దేశం ఏమీ లేదంటూ

మీరన్నది నిజంగా యథార్థం. నిజంగా అది ఒక గే స్టోరీ అయినా అందులో ఏమీ తప్పులేదు.. నేను ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాన్ని మా స్నేహితుడికి చెప్పాలని ప్రయత్నించాను అంతకుమించి అందులో ఏమీ లేదు. నేను సినిమాని తప్పు పట్టడానికి గాని తక్కువ చేయడానికి కానీ ప్రయత్నించలేదు. శోభు మీరు దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను సినిమా గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడటం లేదు గతంలో ఒక న్యూస్ కథనాన్ని నేను ప్రస్తావించాను తప్ప ఇందులో నా ఉద్దేశం ఏమీ లేదంటూ ఆయన కామెంట్ చేశాడు.

భారతీయులే కించపరుస్తున్నారంటూ

భారతీయులే కించపరుస్తున్నారంటూ


అయితే ఇది గే లవ్ స్టోరీ అంటూ కొంతమంది వ్యక్తులు కామెంట్ చేస్తున్నారంటూ గతంలో ఒక కథనాన్ని ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే అదే కధనాన్ని ప్రస్తావిస్తూ రసూల్ తాను కామెంట్ చేశానని చెబుతున్నారు. అయితే రసూల్ ఇలా కామెంట్ చేయడం మీద తెలుగు నెటిజెన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన సినిమాని మన భారతీయులే కించపరుస్తున్నారంటూ పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. మరి ఈ విషయం రసూల్ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X