నాగార్జున 'రగడ' ఫైనల్ రిజల్ట్ ఏమిటి?
నాగార్జున, వీరూ పోట్ల కాంబినేషన్ లో శుక్రవారం విడుదలైన "రగడ" చిత్రం ఫైనల్ గా డిజాస్టర్ చిత్రంగా టాక్ ని తెచ్చుకుంది. అయితే మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం ఈ చిత్రానికి ఉన్నంతలో ప్లస్ గా నిలించింది. రచయిత నుంచి దర్శకుడుగా మారిన వీరుపోట్ల ఈ చిత్రానికి అందించిన కధా, కథనాలే చిత్రాన్ని దెబ్బ తీసాయని, ముఖ్యంగా విలన్స్ ఎక్కువ కావటం, హీరో ఏం పని మీద వచ్చాడో ఇంటర్వెల్ అయిన సగందాకా రివిల్ కాకపోవటం కారణంగా చెప్తున్నారు. అలాగే హీరోయిన్స్ అనూష్క, ప్రియమణి ట్విస్ట్ లు కూడా దర్శకుడు ఊహించిన విధంగా పెద్ద ఇంపాక్ట్ కలగచేయలేకపోవటం కూడా సినిమాకు మైనస్ గా మారిందని అంటున్నారు. ఏదైమైనా ఈ చిత్రం దర్శకుల రెండో సినిమా ప్లాఫ్ సెంటిమెంట్ ని తప్పలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











