సిద్దార్ధ 'అనగనగా ఒక ధీరుడు' హిట్టా...ఫట్టా?

By Srikanya

సిద్దార్ధ, శృతిహాసన్ కాంబినేషన్ లో కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్య ప్రకాష్ రూపొందించిన జానపద,ఫాంటసీ చిత్రం అనగనగా ఒక ధీరుడు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.గ్రాఫిక్స్ బాగున్నా కథ చాలా బోర్ గా ఉండటం, నటీనటుల హావ భావాలు చిత్రానికి మైనస్ గా నిలిచాయి. అలాగే ధీరుడుగా,వీరుడుగా సిద్దార్ధ అస్సలు నప్పలేదంటూ వినపడుతున్నాయి. ప్రోమోలు చూసి ధియోటర్స్ కి వెళ్ళినవారు సంక్రాంతి పండుగరోజు భలే బలైపోయామే అని ఫీలై కామెంట్స్ చేసుకుంటూ రావటం ఈ ధియోటర్స్ వద్ద కనపడుతోంది. ఇక ఈ చిత్రంలో కథ ఏమిటంటే... అంగరాజ్యం పరిస్ధితి ఏమీ బాగుండదు. ఐరెంద్రి(లక్ష్మి ప్రసన్న) అనే మంత్రగత్తె ఆత్మ అంగరాజ్యంఫై పగపట్టి కాలనేత్రం సాయంతో దుర్మార్గం సృష్టిస్తూ అక్కడి వారిని పీడిస్తూంటుంది. ఇక మరో ప్రక్క పుష్పకవనంలో ఉన్న మోక్ష (బేబీ హర్షిత) సహాయంతో ఐరెంద్రి ఆట కట్టించవచ్చు అని తెలుసుకుని ద్రుకి అనే వ్యక్తి అక్కడకు బయలు దేరతాడు. శరీరంలేకుండా ఆత్మతో మాత్రమే ఉన్న ఐరెంద్రి బ్రతకటానికి ప్రతి రోజు ఒక రక్తంబొట్టు కావాల్సి ఉంటుంది అది కూడా తమ వంశపు వ్యక్తి నుండే కావాల్సి ఉంటుంది.

అలా వాళ్ళవంశంలో చివరిది అయిన ప్రియ (శృతి హసన్) ను బందించి రక్తపు బొట్టు తీసుకుంటూ ఉంటుంది. రక్తపుబొట్టు సమస్యను శాశ్వతంగా పరిష్కరించి చావులేకుండా చేసుకోవాలంటే సర్పశక్తికి మోక్ష ను బలివ్వాలని తెలుసుకుని ఆమెను పట్టి తెమ్మంటుంది. పుష్పకవనంలో మోక్షను యోధ(సిద్ధార్ధ) అనే ఒక అంధయోధుడు సంరక్షిస్తూ ఉంటాడు. అంగ రాజ్యపు వ్యధ విని అక్కడి వారిని కాపాడటానికి మోక్షను తీసుకు బయలుదేరతాడు యోధ. గతంలో యోధ, ప్రియ ప్రేమికులు కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ప్రియకు దూరమై కళ్ళు పోగొట్టుకుంటాడు యోధ. పుష్పక వనం నుండి బయలుదేరి మోక్షను ఐరెంద్రి నుండి కాపాడుతూ తీసుకు వెళ్ళి అంగరాజ్యాన్ని ఏవిధంగా రక్షించాడు అన్నది మిగిలిన కధ.ఈ చిత్రం లోని మూల కథను హాలీవుడ్ చిత్రం విల్లో(1988) లేపి, దానికి చాలా కాలం క్రిందట మోహన్ లాల్ తో వచ్చిన యోధా చిత్రం కలిపి వండి తయారు చేసారు. అయితే సరైన దినుసులు పడినా వంటకం సరిగా కుదరకపోవటంతో ఫ్రేక్షకులకు భారంగా తయారైంది.పిల్లలకు నచ్చవచ్చేమో అని దర్శక,నిర్మాతలు భావించినా వారినీ ఆకట్టుకునే లక్షణాలు ఏమీ చిత్రంలో లేవు.ఫైనల్ గా ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన పరమవీర చక్రకు ప్లాప్ లో పోటీగా తయారైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X