'శివ' కు ఇరవై ఏళ్ళ పండగ

By Staff

Shiva
తెలుగు సినిమా చరిత్రను శివ ముందు...శివ తర్వాత అని విభజించేంత అధ్భుతంగా తీయబడ్డ శివ చిత్రం ఇరవై ఏళ్ళు (అక్టోబర్ 5,1989) పూర్తి చేసుకుంది. నాగార్జున,అమల జంటగా రఘువరన్ మరో ముఖ్యపాత్రలో ఎస్.ఎస్.క్రియేషన్స్ ,అన్నపూర్ణ స్టూడియోస్ కలిపి నిర్మించిన ఈ చిత్రం లో కెమెరా మెన్ గోపాలరెడ్డిగారిది కూడా మేజర్ షేరే.ఈ చిత్రం గురించి వర్మ గత కొద్దిరోజులుగా తన బ్లాగ్ లలో రాసుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా 'శివ'గూర్చి కొన్ని ముచ్చట్లు...

శివ సినిమా బడ్జెట్టు ఎనభై అయిదు లక్షలు మాత్రమే..రిలీజయ్యాక తమిళ డభ్బింగ్ రైట్స్ ఎనభై అయిదు లక్షలకు అమ్మటం రికార్డ్ (కోటి పైగా కలెక్ట్ చేసింది). ఇక వర్మకు దర్శకుడిగా రెమ్యునేషన్ కేవలం యాభైవేల రూపాయిలు మరియు ఫైవ్ పర్శంట్ లాభాల్లో షేర్. అలాగే ఇళయరాజాకు సంగీత దర్శకుడిగా నాలుగు లక్షలు ఇచ్చారు. విలన్ రఘువరన్ పాత్రకు రెండు లక్షలు పే చేసారు. ఒక్క నైజాం ఏరియాలోనే ఒక కోటి రూపాయలు వసూలు చేసింది. హిందీ వెర్షన్ మార్పులకు ఒక కోటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టారు. ఆ సినిమా 1990 డిసెంబర్ ఏడున రిలీజై ముంబయి,కలకత్తాలో మంచి బిజెనెస్ చేసింది.హిందీ వెర్షన్ లో పూరీ జగన్నాధ్ స్టూడెంట్ గా కనిపిస్తాడు. అలాగే కృష్ణ వంశీ తెలుగు శివ కు మధ్యలో జాయిన్ అయి హిందీ వెర్షన్ పూర్తిగా చేసాడు.

ఇక శివ సినిమా ప్లాట్ లైన్ ఎలా పుట్టిందో తన బ్లాగ్ లో చెప్పుకొచ్చారు. బ్రూసిలీ 'రిటన్ ఆఫ్ ది డ్రాగన్' సినిమానలోని మెయిన్ పాయింట్ ని లిప్ట్ చేసి శివ రూపొందించారుట. అందులో లీ రోమ్ లో ఉన్న ఓ చైనీస్ రెస్టారెంట్ లో పనిచేయటానికి హాంకాంగ్ నుంచి వస్తాడు. అక్కడ లోకల్ గూండాలు ఆ రెస్టారెంట్ ఓనర్ని చాలా ఇబ్బంది పెడుతూంటారు. అది చూసి తట్టుకోలేని స్ధితిలో లీ మెల్లిగా ఆ సమస్యలోకి దూరి వాళ్ళతో తగువు పెట్టుకుంటాడు. అయితే లీ ఊహించినంత తక్కువగా ఆ గూండాలు ఉండరు.వాళ్ళ వెనక చాలా పెద్ద నెట్ వర్క్ ఉంటుంది.

క్లైమాక్స్ లో వాళ్ళ డాన్ Chuck Norris తో లీ పోరాడి గెలుస్తాడు. అదే విధంగా నాగార్జున టౌన్ నుంచి సిటీ కాలేజీకి వస్తాడు. అప్పటికే ఆ కాలేజి పూర్తిగా గూండాల ఆధ్వర్యంలో ఉంటుంది. లోకల్ గూండాలు స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతూంటారు. వారితో పోరాడుతూ చివరకు రఘువరన్ తో క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ చేసి గెలుస్తాడు. అలాగే సింపుల్ గా ఉన్న ప్లాట్ లైన్ కి ఆయన కొన్ని తన నిజ జీవిత పాత్రలును ఎడాప్ట్ చేసానంటారు వర్మ.

అలాగే సినిమాలో బాగా పేలిన సన్నివేశాలు కూడా కాపీనే అంటాడాయన . ముఖ్యంగా..సినిమాలో వచ్చే గణపతి చందా కలెక్షన్ సీన్ దిలీప్ శంకర్ కాలచక్ర సినిమాలోది. అలాగే పాట ముందు నాగార్జునకు అమల కాఫీ ఇచ్చే సీను సంజీవ్ కుమార్ సినిమాలోదిట. అలాగే హైలెట్ గా నిలిచిన సైకిల్ ఛేజింగ్ సన్నివేశం రాహుల్ రవైల్ అర్జున్ సినిమాలోది. ఇక నాగార్జున మిత్రుడు చనిపోతే అతని తల్లి ఇన్సపెక్టర్ ని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం స్టీవెన్ స్పీల్ బర్గ్ జాస్ సినిమాలోదిట. చిన్నా పోల్ గుద్దుకుని పడిపోయే షాట్ ...కమల్ హాసన్,శ్రీదేవి జంటగా చేసిన వసంత కోకిల లలో కమల్ ట్రైన్ ని పట్టుకుందామని పరుగెడుతూ పోల్ ని గుద్దుకుని పడిపోతాడు. ఇక సుధాకర్ రాయికి తగిలి పడిపోయే సీన్ అమీర్ ఖాన్ చేసిన కయామత్ సె కయామత్ లోది.నాగార్జున హాస్పటల్ లో నరేష్ ని చూసి రియాక్ట్ అయ్యే సన్నివేశం మ్యాడ్ మాక్స్ లోది.క్లైమాక్స్ లో నాగార్జున,రఘువరన్ ఫైట్ సీన్ గ్రెగరీ పెక్,ఒమర్ షరీప్ చేసిన మెకన్నాస్ గోల్డ్ చిత్రంలోది.ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయట.

సైకిల్ చైన్ సీన్ లో చేతులు ప్రోమో లో చూపినవి అక్కినేని వెంకట్ వి .గుణ్ణం గంగరాజు వాటిని వాటిని రూపొందించాడు.సినిమాలో క్లోజ్ లో చూపే చేతులు మాత్రం కెమెరా మెన్ రసూల్ వి.ఇక తేజా పోస్టర్స్ ని మరో చరిత్రను చూసి ఫాలో అయ్యి బ్లాక్ అండ్ వైట్ లో మనుషులు కనపడకుండా డిజైన్ చేసారు. పోస్టర్స్ లో ఓన్లీ సైకిల్ చైన్ మాత్రమే కనపడే ఐడియా కూడా అతనిదే. ఇక స్టడీకామ్ రసూల్ హ్యాండిల్ చేసారు. అప్పటికీ స్టడీకామ్ లు ఎవరూ వాడటం లేదు.

అలాగే సినిమాలో మాగ్జిమం చాలా భాగం ఆంధ్రాలోనే తీయటం మరో విశేషం.ఇర రచయితగా తణికెళ్ళ భరణి రెమ్యునేషన్ పాతిక వేలు మాత్రమే తీసుకుంటే నటుడుగా ముఫ్ఫై ఐదు వేలు తీసుకున్నారు.ఇక ఈ సినిమా ఒరి్జనల్ గా ఇరవై రెండు సెంటర్లలలో వంద రోజులు ఆడి నిర్మాతలుకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. నూతన తరానికి ధైర్యాన్నిచ్చింది. ఎందరో ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీకి రావటానికి కారణమయ్యింది. ఇప్పటికీ తెలుగులో తప్పనిసరిగా ప్రతీ ఇంట్లోను ఉండే సినిమాగా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X