»   » 80ల నాటి స్టార్ హీరోలు,హీరోయిన్స్ మీట్..లుంగీ డాన్స్ ( ఫొటోలు)

80ల నాటి స్టార్ హీరోలు,హీరోయిన్స్ మీట్..లుంగీ డాన్స్ ( ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :1980వ దశకంలోని సినీతారలంతా కలుసుకొని ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.. చిందులేసి సంబరాలు చేసుకున్నారు. ఈ అపురూప ఘట్టానికి చెన్నై వేదికైంది. అక్కడి ఆలీవ్‌ బీచ్‌లోని ఓ అతిథి గృహంలో 80 దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటీనటులంతా ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సంబరాల్లో తెలుగు తారలు చిరంజీవి, వెంకటేష్‌, నరేష్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సందర్భంగా ఆ గృహాన్ని ఎర్రటి కార్పెట్లు, గులాబీలు, ఎర్రటి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లతో సుందరంగా అలంకరించారు. ఈ అపూర్వ కలయికలో పాల్గొన్న నటీనటులూ ఎర్రరంగు దుస్తులు ధరించి కనువిందు చేశారు. నటీమణులు సుహాసిని, ఖుష్బూ తదితరులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అతిథులను ఆహ్వానించారు.

వరుసగా ఆరో సంవత్సరం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొత్త అతిథులుగా బాలీవుడ్‌ తారలు జాకీ ష్రాఫ్‌, పూనం దిల్లాన్‌, స్వప్న హాజరయ్యారు. గత సమావేశానికి సంబంధించిన వీడియోలను తిలకించారు. 80ల్లో విజయవంతమైన హిందీ, తమిళ, మలయాళ గీతాలను మోహన్‌లాల్‌, సుహాసిని ఆలపించగా పూర్ణిమ, సుహాసిని, మేనక తదితరులు అందమైన స్టెప్పులతో అలరించారు.

కార్యక్రమంలో తారలు చేసిన లుంగీ డాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాటిలో 12 లుంగీలను జాకీ ష్రాఫ్‌ తీపిగుర్తుగా ముంబయి తీసుకెళ్లారు. ఈ సంబరాల్లో భానుచందర్‌, సుమలత, సరిత, రాధ, రాధిక, రమ్యకృష్ణ, జయసుధ తదితరులు ఉన్నారు.

ఆ ఫొటోలను ఇక్కడ చూడండి...

గ్రూఫ్ ఫొటో ఇది...

గ్రూఫ్ ఫొటో ఇది...

ఈ రీయూనియన్ కు హాజరైన స్టార్స్ అందరూ కలిసి దిగిన గ్రూఫ్ ఫొటో ఇది

చిరుతో

చిరుతో

చిరు తో కలిసి సుమన్, వెంకటేష్, ...

జాకీ షాఫ్ర్, సుహాసినితో కలిసి

జాకీ షాఫ్ర్, సుహాసినితో కలిసి

ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి ఇలా...

కుష్భూతో

కుష్భూతో

జాకీషాఫ్ర్, ఖుష్బూ కలిసి ఇలా...

పూనం ధ్రిల్లాన్ తో

పూనం ధ్రిల్లాన్ తో

సుహాసినితో కలిసి పూనం ధ్రిల్లాన్ తో కలసి...

సుహాసిని మాట్లాడుతూ...

సుహాసిని మాట్లాడుతూ...

ఆ మీట్ లో సుహాసిని మాట్లాడుతూ తనకు పూనం తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు

జయసుధ తో

జయసుధ తో

వెంకీ,సత్యరాజ్, వెంకటేష్, జయసుధతో కలిసి...

మోహన్ లాల్

మోహన్ లాల్

మోహన్ లాల్,రాధిక కలిసి ఈ మీట్ లో సరదాగా

చిరు, రాధిక

చిరు, రాధిక

చిరంజీవితో కలిసి రాధిక తో ఇలా...

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ తో కలిసి మోహన్ లాల్, రాధిక

రాధికతో శ్రీప్రియ

రాధికతో శ్రీప్రియ

రాధిక, శ్రీప్రియ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ పార్టీలో కనిపించారు

కమల్, రజనీ

కమల్, రజనీ

వీరిద్దరూ ఈ మీట్ లో మిస్సయ్యారు

బాలకృష్ణ, నాగార్జున

బాలకృష్ణ, నాగార్జున

ఇదే మీట్ కు రెగ్యులర్ గా వెళ్లే బాలకృష్ణ, నాగార్జున మిస్సయ్యారు

English summary
The 6th reunion of the 80’s super stars of South Indian cinema held at Chennai. Most of the prominent members of the group marked their presence in the function.80’s super stars and heroins celebrated their personal friendship gifted by cinema.Prabhu,mohan lal,Jayaram,Chiranjeevi,Suman,Rehman etc signed in the list of heroes hereas Revathy,Shobhana,Lissy,Poornima Bhagyaraj etc in the heroin list.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu