'శ్రీరామరాజ్యం'నిర్మాత కుమారుడు లాంచింగ్ చిత్రం

By Srikanya

Intintaa Annamayya
హైదరాబాద్ : 'శ్రీరామరాజ్యం'నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ లాంచింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఈ యువ హీరో తెరంగ్రేటం చేయనున్నారు. 'ఇంటింటా అన్నమయ్య'టైటిల్ తో రూపొందే ఈ చిత్రంవ విజయదశమి రోజున ప్రారంభం కానుంది. ఇది సాంఘిక కథాంశంతో రూపొందే చిత్రమే. యువతరం ఆలోచనలకు తగ్గట్టే ఉంటుంది అని చెప్తున్నారు.

అయితే ఈ కథా వస్తువులో అన్నమయ్య కీర్తనలు, ఆయన నెలకొల్పిన సంగీత సంప్రదాయాల్ని ఎలా మేళవించారన్నది సస్పెన్స్‌ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తారు. త్వరలో తిరుపతిలో సంగీత చర్చలు మొదలవుతాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంది. ఒక నాయికగా 'జర్నీ'లో నటించిన అనన్యను ఎంచుకొన్నారు. ఎస్‌.గోపాలరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తారు.

'అన్నమయ్య' నుంచి దర్శకులు కె.రాఘవేంద్రరావు భక్తి భావ చిత్రాల రూపకల్పనలో తనదైన ముద్రను చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'శిరిడి సాయి'ని సిద్ధం చేస్తున్నారు. ఆ తరవాత 'ఇంటింటా అన్నమయ్య' అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారని విశ్వసనీయ సమాచారం. విజయ దశమి రోజున ఈ చిత్రానికి శ్రీకారం చుడతారు. 'శ్రీరామరాజ్యం' తీసిన యలమంచిలి సాయిబాబు నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X