Chiranjeevi: చిరంజీవి పార్టీలో రేవంత్ రెడ్డి.. రామ్ చరణ్‌తో ఆప్యాయంగా.. ఫొటోలు చూశారంటే!

భారత ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమమైన అవార్డుల్లో పద్మ పురస్కారాలు ప్రత్యేకమైనవి అని వేరేగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటిస్తుంటుంది. ఇక, ఈ సంవత్సరానికి గానూ ఇటీవలే పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడంతో ఆయనకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఎంతో మంది సినిమా, రాజకీయల నేపథ్యం ఉన్న సెలెబ్రిటీలు స్వయంగా ఆయనను కలిసి సన్మానించారు. దీంతో అప్పటి నుంచి చిరంజీవి పేరు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతోంది.

Revanth Reddy Attends Chiranjeevi at Special Party and Congratulate Him

పద్మ విభూషణ్ అవార్డుతో ఫుల్ జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. దీనికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై.. ఈ స్పెషల్ పార్టీలో తెగ సందడి చేశారు.

ప్రత్యేక ఆహ్వానం మేరకు విందుకు హాజరైన రేవంత్ రెడ్డి ముందుగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ ఆప్యాయంగా మాట్లాడారు. వీళ్లిద్దరూ చాలా సేపు ముచ్చటిస్తూ కనిపించారు. అనంతరం విందు ఆరగించారు.

ఇక, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో 'శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని చెప్పారు. దీనికి బదులుగా చిరంజీవి 'నన్ను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు' అని చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ (X) ఖాతాలో తెలిపింది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడివి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X