పవనోవిచ్ పేరులో"నేముందీ"??: వర్మకే మెసేజ్ పెట్టిన కూతురు, పనిలేక పోస్ట్‌లు పెడుతున్నావ్ అంటూ...
పవన్ కొడుకు పేరు మీద వర్మ స్పందించిన తీరు ఇప్పుడు వర్మ కూతురితో గొడవకి కారణమైంది. అసలు నీకేం పనిలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నావ్ అంటూ తండ్రినే నిలదీసింది రేవతి వర్మ.
Recommended Video

పవన్ కళ్యాణ్ కొడుకు పేరు మీద వర్మ స్పందించిన తీరు ఇప్పుడు వర్మ కూతురితో గొడవకి కారణమైంది. ఇద్దరి మధ్యా మెసేజ్ లయుద్దం జరిగింది. అసలు నీకేం పనిలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నావ్ అంటూ తండ్రినే నిలదీసింది రేవతి. పవన్ అటు రష్యన్, ఇటు ఇండియన్ సాంప్రాదాల కలయికగా "మార్క్ శంకర్ పవనోవిచ్" అనే పేరు పెట్టాడు. చిరంజీవి అసలు పేరైన శివశంకర వరప్రసాద్ లోని శంకర్ నీ, తనపేరులోని పవన్ నీ కలిపి పవన్ పెట్టుకున్న పేరు రామ్‌గోపాల్ వర్మకి మాత్రం వెటకారంగా కనిపించిందట.

ఇప్పటివరకూ వినని పేరు
ఈ ప్రపంచంలో క్రైస్తవం పుట్టక ముందు నుంచి, అసలు మానవులు మాట్లాడుకోగలరా? అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్-1 పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా, ఇప్పటివరకూ వినని పేరును తానిప్పుడు విన్నానని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.

అత్యంత గొప్పది ఇదే
ఈ పేరు అతి గొప్పదని వర్మ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. భాషలు పుట్టిన తరువాత తాను విన్న పేర్లలో అత్యంత గొప్పది ఇదేనని చెప్పాడు. ఇలా పవన్ కళ్యాణ్‌నే కాదు ఇక పవనోవిచ్ మీద కూడా యుద్దం మొదలు పెట్టాడు వర్మ...

ఆ మెసేజ్ కి సమాధానం ఇచ్చి
అయితే ఈ యుద్దం కాస్తా వర్మకీ ఆయన కూతురుకీ మధ్య మొదలయ్యింది. అసలు పవన్ కళ్యాన్ కొడుక్కు చరిత్రకూ సంబందం ఏముందీ అంటూ వర్మకి మెసేజ్ పెట్టిందట రేవతి. ఆ మెసేజ్ కి సమాధానం ఇచ్చి.. మళ్ళీ అది కూడా తెచ్చి తన వాల్ మీద పోస్ట్ చేసాడు.. మొత్తానికి పవన్ కళ్యాణ్ కే కాదు పవన్ కుమారుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందన్న మాట. ఇంతకీ రేవతి పెట్టిన మెసేజ్ ఏమిటీ?

ఏం పనీలేక ఇలాంటి పోస్టులు
ఈ పోస్టులో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని చెప్పింది. సామాన్యులకు అందని పదాలు వాడుతూ పోస్టులు చేయడాన్ని తప్పుబట్టింది. ఏం పనీలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆక్షేపించింది. చరిత్రకు, ఈ పేరుకు పొంతన ఎక్కడుందని నిలదీసింది. ఇక స్వతహాగా పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన తన కుమార్తె వ్యాఖ్యలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన వర్మ, సమాధానాన్నీ ఇచ్చాడు.

వైరల్ అవుతోంది
నీకసలు అర్థం చేసుకోవడం రానే రాదనే విషయం నువ్వు రాసిన కామెంట్ చూస్తేనే అర్థం అవుతోందని అక్షింతలు వేశాడు. మీ అందరికంటే పవన్ కల్యాణ్ ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు. ఈ సంభాషణను తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











