హాట్ లేడీస్ : ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?
ముంబై: బాలీవుడ్ సినిమాల బడ్జెట్ పెరిగిపోతోంది. మరోవైపు వసూళ్లు కూడా వంద కోట్ల స్థాయిని ఈజీగా అందుకుంటోంది. బాలీవుడ్ మార్కెట్ ఇలా ఒక్కసారిగా పెరిగిపోవడంతో రెమ్యూనరేషన్లు కూడా అదే రేంజ్ లో చుక్కలనంటుతున్నాయి. ఇటీవల కాలం వరకు ఓ భారీ సినిమా తెరకెక్కించడానికి సరిపోయే డబ్బును ఇప్పుడు హీరోలు అందుకుంటున్నారు.
పారితోషికం తీసుకుంటూనే లాభాల్లో కూడా వాటా అడుగుతున్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి వాళ్లు సుమారు 30 కోట్ల నుంచి 40 కోట్ల పారితోషికం తీసుకుంటూనే లాభాల్లో వాటా తీసుకుంటున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా.
అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో హీరోయిన్లు కూడా ముందంజలోనే ఉన్నారు. గతం నుంచి దృష్టి సారిస్తే హీరోలకు ధీటుగా పారితోషికం అందుకున్న నటి హేమమాలిని అనే చెప్పాలి. ఇప్పటి హీరోయిన్లు కూడా తక్కువేమీ కాకపోయినా, హీరోలతో సరితూగేంత కాదు. బాలీవుడ్ హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు స్లైడ్ షోలో...

కత్రినా కైఫ్ రెమ్యూనరేషన్
హీరోయిన్ కత్రినా కైఫ్ సినిమాకు తన డేట్స్, పాత్ర తీరును బట్టి రూ. 8 కోట్ల నుండి 15 కోట్ల వరకు తీసుకుంటోంది.

కరీనా కపూర్ రెమ్యూనరేషన్
హీరోయిన్ కరీనా కపూర్ రూ. 10 నుండి 14 కోట్ల వరకు తీసుకుంటోందట.

విద్యాబాలన్
ఇక మరో హీరోయిన్ విద్యా బాలన్ ఒక్కో సినిమాకు రూ. 5 నుండి 9 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ రూ. 5 నుండి 9 కోట్ల మధ్యలో ఉందని తెలుస్తోంది.

దీపిక పదుకోన్
హీరోయిన్ దీపిక పదుకోన్ రెమ్యూనరేషన్ రూ. 5 నుండి 8 కోట్ల వరకు ఉందని అంచనా.

అనుష్క శర్మ
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మ రెమ్యూనరేషన్ సినిమాను బట్టి రూ. 3 నుండి 8 కోట్ల వరకు ఉంటుందట.

సోనాక్షి సిన్హా
హీరోయిన్ సోనాక్షి సిన్హా రెమ్యూనరేషన్ సినిమా డేట్స్ ఆధారంగా రూ. 3 నుండి 7 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

బిపాసా బసు
ఇక మరో హీరోయిన్ బిపాసా బసు రెమ్యూనరేషన్ రూ. 4 నుండి 5 కోట్ల మధ్యలో ఉంది.

సోనమ్ కపూర్
పెద్దగా స్టార్ ఇమేజ్ లేని సోనమ్ కపూర్ రూ. 2.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.

కంగనా రనౌత్
ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరైన కంగనా రనౌత్ రూ. 3 నుండి. 4.5 కోట్ల వరకు తీసుకుంటోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెమ్యూనరేషన్ రూ. 3 నుండి 4 కోట్ల వరకు ఉందట.

అసిన్
సౌత్ నుండి బాలీవుడ్‍కు వలస వెళ్లిన అసిన్ రూ. 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు తీసుకుంటోందట.


Click it and Unblock the Notifications











