బట్టబయలు: సర్రోగేట్ బేబీకి తండ్రైన షారుక్‌ఖాన్
ముంబై : బాలీవుడ్ స్టార్ కపుల్ షారుక్-గౌరీ ఖాన్ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని, ఇందుకోసం సర్రోగెన్సీ పద్దతిని ఫాలో అయ్యారని ఇటీవల మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సర్రోగెన్సీ పద్దతి అనగా అద్దెగర్భం. షారుక్ వీర్యకణాలు, గౌరీ అండం ద్వారా పుట్టే బిడ్డను వేరొక మహిళ గర్భంలో పెంచడం అన్నమాట.
తాజాగా ముంబై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షారుక్ ఖాన్-గౌరీఖాన్ దంపతులు మూడో బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటీవల ఈ బిడ్డ జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అందింది. ఇందులో షారుక్-గౌరీ పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉందని అధికారులు వెల్లడించారు.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యశాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ...'ముంబై కార్పొరేషన్ అధికారులకి ఒక మగ పిల్లాడికి సంబంధించిన పుట్టిన వివరాలు అందాయి. మే 27వ తేదీన ఆ బిడ్డ జన్మించాడు. ఆ పిల్లాడి తల్లిదండ్రులుగా షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ పేర్లు పేర్కొనబడి ఉన్నాయి. అంధేరిలోని మస్కాని ఉమెన్స్ ఆసుపత్రి నుంచి ఈ వివరాలు అందాయి' అని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం వన్ ఇండియాలో ప్రచురితమైన ఆర్టికల్‌లో....గౌరీఖాన్ మరదలు నమితా చిబ్బెర్ ఇటీవల ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో మగ పిల్లాడికి జన్మనిచ్చినట్లు పేర్కొన్నాము. అయితే ఆ బేబీ ఏడు నెలల వయసులోనే జన్మించడంతో ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉంచినట్లు పేర్కొన్నాము.
తాజాగా అందుతన్న వివరాల ప్రకారం.....నమితా చిబ్బెర్ కడుపులో సర్కోగేట్ పద్దతిలో పెరిగింది షారుక్-గౌరీ ఖాన్‌ల బిడ్డేనని తెలుస్తోంది. బిడ్డ డెలివరీ అయిన తర్వాత షారుక్-గౌరీలకు అప్పజెప్పి ఆమె తిరిగి లండన్ వెళ్లి పోయిందని తెలుస్తోంది. సర్రోగేట్ పద్దతిలో తనకు కలిగిన మూడో సంతానం గురించి షారుక్ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు వెల్లడించే అవకాశం ఉంది.

భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానాలతో కలిసి షారుక్

షారుక్ ఖాన్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు ఆర్యన్, కూతురు పేరు సుహానా

షారుక్ ఖాన్ తన ఇద్దరు పిల్లతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. తండ్రిలా కాకుండా వారితో స్నేహితుడిలా వ్యవహరిస్తూ ఉంటాడు.

షారుక్ తనయుడు ఆర్యన్ ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్నాడు. ఆర్యన్ ను తన సినీ వారసుడిగా తీర్చి దిద్దుతున్నాడు షారుక్

తండ్రి షారుక్ తో కలిసి సైకిల్ తొక్కుతూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుహానా


Click it and Unblock the Notifications











