పవన్ 'తీన్ మార్'లో వరస్ట్ సీన్ అదే
నేను "తీన్ మార్" చిత్రాన్ని మొదటి రోజే చూసాను.టోటల్ గా కన్ఫూజ్ అయిపోయాను. ఈ సినిమా చూసాక లవ్ ఆజ్ కల్ చిత్రం చూస్తే కాని నిద్రపట్టలేదు.నేను ఈ రెండు వెర్షన్ లు కంపేర్ చేయటం లేదు కానీ..తీన్ మార్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది.ఈ చిత్రానికి ఎన్నో ప్యాచెస్ ఉన్నాయి. మొదటగా పవన్ కళ్యాణ్ విప్లవ భావాలన్న పాత్ర అర్జున్ పాల్వాయ్ సీన్స్ అస్సలు ఎఫెక్టివ్ గా లేవు. తర్వాత పవన్ సరసన వసుమతి గా చేసిన కీర్తి కర్బంద అసలు నటి అంటే ఎవరూ నమ్మరు.అలా ఉందామె. ఇక ఫైట్ సీన్స్ అయితే సినిమాలో అనవసరం. ఆలీ పాత్ర శుద్ద వేస్ట్ అని చెప్పాలి. సినిమాలో వరస్ట్ సీన్ ఏమిటా అంటే పవన్ ఇటాలియన్ లాంగ్వేజ్ లో మాట్లాడటం,దానికి త్రిష ఫీలయ్యి మూడ్ తెచ్చుకోవటం.న్యూయార్క్ ఎపిసోడ్ అయితే పూర్తిగా డిజాస్టర్.క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ లో అసలు వాస్తవికత లేదు. మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ గా ఈ సినిమాని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను.ఈ సినిమాలో ఏదైనా పాజిటివ్ అంశం ఏదైనా ఉందీ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.
రివ్యూ బై :విష్ణు వర్ధన్
[email protected]
మీరు కూడా రివ్యూలు రాస్తే [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.పబ్లిష్ చేస్తాం.


Click it and Unblock the Notifications











