For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2012... హాట్ హాట్ ఐటం గర్ల్స్ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: తెలుగు సినిమాల్లో మళ్లీ ఐటం సాంగ్స్ హవా మొదలైంది. హింది సినిమాల తరహాలో తెలుగు సినిమాల్లో ఐటం సాంగ్స్ కు కూడా విపరీతమైన క్రేజ్ వస్తోంది. కేవలం ఐటం సాంగ్స్ కోసం కూడా థియోటర్స్ కు వెళ్ళే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతకుముందు విలన్ డెన్ లలో వచ్చే ఐటం సాంగ్స్ ఇప్పుడు క్యాజువల్ గా కావాల్సినప్పుడు వచ్చేస్తున్నాయి.

  ఐటం సాంగ్స్ చేయటానికి బాలీవుడ్ లో హీరోయిన్స్ సైతం ఎగబడుతున్నారు. అయితే తెలుగులో ఐటం సాంగ్స్ చేయటానికి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ముందుకు రావటం లేదు. కానీ చార్మి వంటి వారు ఐటం సాంగ్స్ తో అదరకొడుతున్నారు. ఒక సినిమాలో నటిస్తే వచ్చే రెమ్యునరేషన్‌ కేవలం ఒక్క పాటకు డాన్స్ చేస్తే వచ్చేంస్తూండటంతో డిమాండ్ తగ్గిన హీరోయిన్స్ చూపు వీటిపైనే ఉంటోంది.

  గడిచిన 2012 సంవత్సరం మన తెలుగు సినిమాలలో ఐటం సాంగ్స్‌ సంస్కృతి బాగా పెరిగిందనే చెప్పాలి. 2011 సంవత్సరంతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్నాడంటే ఖచ్చింతంగా ఆ సినిమాలో ఐటం సాంగ్ ఉంటుదన్నమాట.

  దేవిశ్రీ ఇచ్చిన ఐటం సాంగ్స్‌ అన్నీ దాదాపు హిట్‌ కావడంతో ఇప్పుడు నిర్మాతలంతా దేవిశ్రీ వెంట పడుతున్నారు. ఇదే ఊపులో 2013లోనూ మరిన్ని ఐటం సాంగ్స్‌ జనాలను అలరించేలా ఉన్నాయి. ఇక నిర్మాతలు కూడా సెంటిమెంట్‌గా ఐటం సాంగ్స్‌ను తప్పకుండా తమ సినిమాలలో పెట్టుకుంటారేమో అనిపిస్తోంది.

  పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌' చిత్రంలో కెవ్వుకేక ఐటం సాంగ్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసారు. బాలీవుడ్ హాటీ మలైకా అరోరా తన అందాల విందుతో ఈ పాటకు కిక్ ఇచ్చింది.

  మహేష్‌ బాబు, పూరిల కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్‌ మేన్‌' చిత్రంలో ‘వియ్‌ ఆర్‌ బ్యాడ్‌ బాయ్స్‌' పాట ఒక పక్క సంచలనం సృష్టించి మరో పక్క వివాదానికి తెరతీసింది. ప్రత్యేకించి ఓ వర్గం మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటలో శ్వేతా భరద్వాజ్ సెక్స్ పోజ్ లతో మతిపోగొట్టింది.

  పూరీ, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రం ‘జ్వరమొచ్చిందే' అంటూ స్కారెలెట్ విల్సన్ అనే మోడల్‌తో పూరీ జగన్నాధ్‌ వేయించిన స్టెప్స్‌ అదరగొట్టించాయి.

  నాగార్జున, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢమరుకం' చిత్రంలోని ‘సక్కుభాయ్‌... గరం ఛాయ్‌' పాట కూడా బాగా పాపులర్‌ అయింది. చార్మిని ఈ పాటలో చూసిన వారు మర్చిపోరు అనేలా ఉంది.

  క్రిష్‌, రాణాల కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో ‘బళ్లారి బాబు' పాట కూడా బాగానే జనాలకు ఎక్కింది. సమీరారెడ్డి ఈ పాటలో బాబాయ్, అబ్బాయిలతో అదరకొట్టింది.

  అల్లు అర్జున్, త్రివిక్రమ్.. జులాయిలో టైటిల్ లో సాంగ్ లో ఉదయభాను ఐటం సాంగ్ తరహాలో కనిపించింది.

  రవితేజ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన దేముడు చేసిన మనుష్యులు చిత్రం ప్లాప్ అయినా అందులో గాబ్రియల్‌ అనే జర్మనీ మోడల్ చేసిన ఐటం సాంగ్ డిస్ట్రబ్ చేస్తన్నాడే పాట నిజంగానే డిస్ట్రబ్ చేసింది.

  ఓంకార్... జీనియస్ చిత్రానికి కొద్దో గొప్పో క్రేజ్ వచ్చిందంటే.... డిబ్బిరి డిబ్బిరి అనే ఐటం సాంగ్ ఎఫెక్టే అని ఒప్పుకోవాల్సిందే.

  English summary
  Item-song that gives a proper kick to many mass loving audiences and we are going to see what have really cast magic on Tollywood in 2012. Kevvu Keka is the best item-song of the year undoubtedly as the magic of both Pawan and music director Devi Sri Prasad worked like anything. Bollywood hottie Malaika Arora wooed Telugu audiences with this 'Gabbar Singh' number and cellular companies minted huge revenues by selling caller-tunes of this song.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X