కొన్ని కాంబినేషన్ లు ఒకసారి హిట్ కొడితే మళ్ళీ అదే రిపీట్ చేయటానికి రెడీ అవటం కామన్ .అలాగే ప్రేక్షకులు కూడా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తూండటం మరీ మూమూలే.దాంతో తెలివైన వాళ్ళు తమ పరిస్థితి బాగోనప్పుడు ఈ తరహా కార్యక్రమాలకు తెర తీసి లాభపడటానికి ప్రయత్నిస్తూంటారు.అదే కోవలో ఇప్పుడు రామ్, వై.వి.యస్.జత కట్ట బోతున్నారు.అందులోనూ మొదటి సినిమా (దేవదాస్) తోనే యూత్ లో పాపులర్ అయి తనకంటూ మార్కెట్ సృష్టించుకుని ప్లానింగ్ దూసుకుపోతున్న హీరో రామ్. తర్వాత వచ్చిన జగడం ప్లాప్ అయినా నటుడుగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రెడీ అంటున్నాడు. కాగా రామ్ తో వై.వి.యస్ మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుదామని నిర్ణయించుకున్నారు. తను పరిచయం చేసిన రామ్ ని రే అని పిలవబోతున్నాడు. చౌదిరి ఒక్క మగాడుతో భారీ ఫ్లాప్ ని మూట కట్టుకుని విజయం కోసం కసిగా ఉన్నాడు. అందులోను రే టైటిలు బాగుండటంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.