‘రేయ్’ క్లైమాక్స్ సాంగ్‌కు రూ. కోటిన్నర ఖర్చు
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై వైవిఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. ఈచిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సాంగ్ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు పెడుతున్నారు.
8 నిమిషాల పాటు సాగే ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. కేవలం పాట చిత్రీకరణ కోసమే రూ. కోటిన్నర వరకు ఖర్చు చేస్తున్నారట. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో 20 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించబోతున్నారట.

ఈ క్లైమాక్స్ సాంగ్ గురించి దర్శకుడు వైవిఎస్ చౌదరి వివరిస్తూ....ఈ సినిమాలో క్లైమాక్స్‌లో భారీ సన్నివేశాలు ఏమీ ఉండవు, 8 నిమిషాలపాటు సాగే పాటనే క్లైమాక్స్ గా చిత్రీకరిస్తున్నాం. అమెరికాలోని టాప్ స్టార్స్ మధ్య పోటీ నేపథ్యంలో ఈ పాట వస్తుంది. హీరో బ్యాచ్ ఎలా విజయం సాధించింది అనే అంశంతో ముగింపు ఉంటుంది.
ఈ పాట తయారీకి చక్రి, చంద్రబోస్ చాలా కష్టపడ్డారు. చక్కి, భార్గవి పిళ్లై ఈ పాట పాడారు. మధ్యలో వచ్చే ర్యాప్ బిట్స్‌ని నోయల్ సియాస్ రచించి పాడారు. ఈ సాంగ్ రికార్డింగ్‌కే 2 నెలల సమయం పట్టింది. 20 రోజుల పాటు చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ పాట కోసం అమెరికా నుంచి పాపులర్ ర్యాప్ ఆర్టిస్టు మైక్ స్పెన్సర్ వస్తున్నారు. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 60 మంది డాన్సర్లు, రష్యన్ అమ్మాయిలు ఈ పాటలో పాల్గొంటారు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











