ఇండస్ట్రీ మా ఫ్యామిలీది కాదు...ఏ ఒక్కరిదీ కాదు: పవన్

By Bojja Kumar

హైదరాబాద్: 'సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానిదీ కాదు....అలాగే మా కుటుంబానిది కూడా కాదు. ఈ పరిశ్రమ కష్టపడి వచ్చే ప్రతి ఇక్కరిది' అని వ్యాఖ్యానించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శుక్రవారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగిన 'రేయ్' ఆడియో ఫంక్షన్‌కు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.....'ఎవరినీ రికమండ్ చేసే అలవాటు నాకు ఉండదు. ఇప్పటి వరకు నేను అలాంటి పని చేయలేదు. వైవిఎస్ చౌదరి గారు వచ్చి అక్కయ్యగారి అబ్బాయి సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేస్తానని చెబితే మానసికంగా, మాట పరంగా మాత్రమే సాయం చేసాను' అన్నారు.

తేజ్ ఏంబీఏ చదువుతున్న సమయంలో నా దగ్గరికి వచ్చి సినిమాల్లోకి వస్తానని చెప్పాడు. అప్పుడు నేను ఒకటే చెప్పాను. నటించాలనే కోరిక మనసులో ఉండాలే తప్ప వారసత్వంతో రాదు అని చెప్పాను. నేను తనని సినిమాలకు రికమండ్ చేయలేదు. నాకు తెలిసిన యాక్టింగ్ స్కూల్ గురువుల దగ్గరికి పంపానంతే. సాయి ధరమ్ తేజ్ తనకు తానుగా కష్టపడి మీ అభిమానాన్ని చూరగొంటారని కోరుకుంటున్నాను అన్నారు

ఈ సినిమా పరిశ్రమ కష్టపడే ప్రతి ఒక్కరిది. అంతే కానీ ఏ ఒక్క కుటుంబానిదీ కాదు...అలాగే మా కుటుంబానిదీ కాదు అని పవన్ వ్యాఖ్యానించారు. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

సినిమాల్లోకి పొరపాటున వచ్చాను

సినిమాల్లోకి పొరపాటున వచ్చాను


నాకు సినిమాలంటే నాకు ఇష్టం లేకున్నా... పొరపాటున ఇటు వచ్చాను. ఫ్యామిలీ అనే పదం వాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎంతో మంది కొత్త హీరోలు వస్తున్నారు...అని పవన్ వ్యాఖ్యానించారు.

కొత్తదనం రావాలి.

కొత్తదనం రావాలి.


కొత్త దనం వస్తూ ఉండాలి. నాకు కొత్తదనం రావడం ఇష్టం. నాకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఎవరి ఆడియో ఫంక్షన్ కు అయినా వెళాతా...గతంలో నితిన్ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లాను...అదే విధంగా సాయి ధరమ్ తేజ్ ఆడియో ఫంక్షన్‌కు వచ్చాను అని పవన్ అన్నారు.

చౌదరి మొండి పట్టుదల

చౌదరి మొండి పట్టుదల


చౌదరిగారిలో నాకు నచ్చిన విషయం ఆయన మొండి పట్టుదల. ఆయన మొండి పట్టుదల వల్లనే సినిమా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ స్థాయికి వచ్చింది అన్నారు పవన్ కళ్యాణ్

మరో తెలుగు హీరో మాత్రమే..

మరో తెలుగు హీరో మాత్రమే..


మా ఫ్యామిలీ హీరో అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు అనే విధంగా పవన్ మాట్లాడు. సాయి ధరమ్ తేజ్ మరో తెలుగు హీరో మాత్రమే. అతనికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X