చిరు మేనల్లుడి ‘రేయ్’ మూవీకే ఆ.. ఘనత!
తాజాగా ఈ చిత్రం షూటింగ్ కరేబియన్ దీవుల్లో జరుగుతోంది. సాధరణంగా తెలుగు సినిమాలు యూరఫ్, అమెరికా, ఆసియాలోని దక్షిణ మరియు తూర్పు ప్రదేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. కానీ తొలి సారిగా ఒక తెలుగు సినిమా కరేబియన్ దీవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ ప్రజెంట్ ట్రినిడాడ్-టొబాగోలో ఉంది.
మరో 10 రోజుల పాటు ఇక్కడి అందమైన సముద్ర తీరాల్లో షూటింగ్ జరుగనుంది. ఇప్పటికే 'రేయ్' ఈచిత్రానికి సంబంధించిన కొంత భాగాన్ని లాస్ వెగాస్, సాన్‌ఫ్రాన్సిస్కో, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.
వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












