మెగాస్టార్‌లా ఉన్నాడు ‘రేయ్’(ఫీలర్ లాంచ్ ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో 'రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు.

ఫిబ్రవరి 5న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తునప్నారు. తాజాగా సినిమా ఫీలర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ...సినిమా ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు చౌదరి అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. కానీ పట్టుదలతో, కసితో, చిరునవ్వుతో సినిమాని పూర్తి చేసారు. వైవిఎస్ అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు. అతని ఈ గుణమే ఒక మంచి దర్శకుడిగా తీర్చిదిద్దింది.

సాయిర ధరమ్ తేజ్ అంటే మాకు చాలా ఇష్టం. సినిమాలో తేజ అమెరికా బ్యాగ్రౌండ్ ఉన్న తెలుగు కుర్రాడిగా కనిపిస్తాడు. సినమాలో ఫైట్స్, డాన్స్ బాగా చేసాడని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాతో వైవిఎస్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరికీ హిట్ దక్కుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఈచిత్రంలో ఆయన మామయ్య మెగాస్టార్ చిరంజీవి పోలి ఉంటాడని తెలుస్తోంది. ఆయన ఫోటోలు కూడా చిరంజీవి పాత సినిమాల్లోని లుక్‌ను గుర్తు చేస్తోంది. మిగతా వివరాలుఫోటోలు స్లైడ్ షోలో...

వైవిఎస్ మాట్లాడుతూ...

వైవిఎస్ మాట్లాడుతూ...


2010 అక్టోబర్ దసరాకి ప్రారంభమైన ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యమైంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సినిమాని పూర్తి చేసాం. నమ్మిన సిద్ధాంతం మంచిదైతే ఏ పని మధ్యలో ఆపకూడదు అనే ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, నేను జయాపజయాలను పట్టించుకోను అనే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినిమా పూర్తి చేసాను అన్నారు.

చిరంజీవి మాదిరి..

చిరంజీవి మాదిరి..


హీరో సాయి ధరమ్ తేజ్ పూనాదిరాళ్లు సినిమాలో చిరంజీవిగారిలా కనిపించారు. ఫైట్ష్, డాన్స్ చాలా ఎనర్జిటిక్‌గా చేసారు. శ్రద్ధాదాస్ నెగటివ్ రోల్ చేసింది. చక్రి అద్భుతమైన సంగీతం అందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేస్తాం అన్నారు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


ఒక కొత్త హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. వైవిఎస్ గారిలో ఆ గట్స్ ఉన్నాయి. మరో అవకాశం వస్తే ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. నాతో పాటు సినిమాకు పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.

చిరంజీవితో కుదరలేదు

చిరంజీవితో కుదరలేదు


చిరంజీవి గారితో కలిసి పని చేయాలనుకున్నాను. కుదరలేదు. సాయిధరమ్ తేజతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి. అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. సాయి మంచి హీరోగా నిలబడతాడు అన్నారు.

యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు

యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు


'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు తెలిపారు.

మోగాస్టార్‌లా ఉన్నాడు ‘రేయ్’(ఫీలర్ లాంచ్ ఫోటోలు)

మోగాస్టార్‌లా ఉన్నాడు ‘రేయ్'(ఫీలర్ లాంచ్ ఫోటోలు)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X