పవన్ వస్తున్నాడు... జనవరి 17నే ఫైనల్
హైదరాబాద్ :చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'రేయ్'. సయామీఖేర్ హీరోయిన్ . వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈ నెల 5న విడుదల చేయనున్నారు. కానీ జరగలేదు. ఇప్పుడు కొత్త ఆడియో తేదీని ని నిర్ణయించారని తెలుస్తోంది. జనవరి 17న శిల్పకళా వేదికలో ఈ ఆడియో పంక్షన్ జరగనుంది.
పాటల వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''మా చిత్రానికి పవన్‌కల్యాణ్ అందిస్తున్న ప్రోత్సాహం మర్చిపోలేనిది. 'రేయ్' పాటల వేడుకకు ఆయన రాబోతుండడం... ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 11న ట్రైలర్‌ని చూపిస్తాం. బొమ్మరిల్లు పతాకంపై వచ్చిన సినిమాలోని పాటలన్నీ శ్రోతలను బాగా ఆకట్టుకొన్నాయి. 'రేయ్' పాటలూ అదే స్థాయిలో ఉంటాయి. చక్రి సమకూర్చిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం చక్కగా కుదిరాయి'' అన్నారు. ఫిబ్రవరి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ చిత్రంతోనే బన్నీ దర్శకత్వ ముచ్చట తీర్చుకొన్నారు. ఈ సినిమాలోని అతి కీలకమైన ఓ షాట్... అల్లు అర్జున్ నేతృత్వంలో తెరకెక్కింది. ఈ విషయం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''అవును... ఈ సినిమాలో ఓ షాట్‌కి అల్లు అర్జున్ దర్శకత్వం వహించారు. బన్నీ నాకు 'డాడీ' సినిమా నుంచీ తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం కూడా. అతనిలోని ఎనర్జీ చూస్తే ముచ్చటేస్తుంది. 'దేవదాస్' సినిమాకి తన చేతుల మీదుగానే నేను స్క్రిప్టు అందుకొన్నా. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.
ఓరోజు 'ఇద్దరమ్మాయిలతో', 'రేయ్' షూటింగులు ఒకే చోట జరుగుతున్నాయి. 'రేయ్'కోసం ఓ పాట తెరకెక్కిస్తున్నాం. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే పాట అది. ఆ పాట నిడివి ఎనిమిది నిమిషాలకు పైనే. ఈ పాట కోసం దాదాపు 33 రోజులు శ్రమించాం. అందులోని ఓ కీలకమైన షాట్‌ని బన్నీ చేతుల మీదుగా తెరకెక్కించాం. ఆ ప్రభావమో ఏమో.. అల్లు అర్జున్ ఎనర్జీ ఆ పాటలోనూ కనిపిస్తుంది'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











